Prabhas - NBK : బాలయ్య షో లో ప్రభాస్ సందడి.. అందరి చూపూ డార్లింగ్ షర్ట్‌పైనే, వామ్మో అంత..?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ 2 విజయవంతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షోకి స్టార్ హీరోలు చాలా మంది వచ్చారు. అయితే ఇంకా రావాల్సిన వాళ్లు చాలా మంది వున్నారు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, ప్రభాస్ వంటి స్టార్లు అన్‌స్టాపబుల్ 2కి ఇంకా రాలేదు. అయితే వీరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ షోకి వస్తాడంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ అప్‌డేట్‌లు గాలి వార్తలుగా మారాయి. అయితే ఈసారి మాత్రం ప్రభాస్‌ని తీసుకొచ్చింది ఆహా టీమ్.
గోపీచంద్‌తో కలిసి ప్రభాస్ అల్లరి:
తన బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్‌తో కలిసి ప్రభాస్ ఈ షోకి వచ్చి సందడి చేశారు. మొహమాటస్తుడైన డార్లింగ్‌ని బాలయ్య ఎలా డీల్ చేశారోనని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. గోపీచంద్‌తో కలిసి ప్రభాస్ అల్లరి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ షోకి ప్రభాస్ వేసుకొచ్చిన షర్ట్ గురించి ఇప్పుడు పెద్ద డిస్కషన్ నడుస్తోంది.
ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ షర్ట్‌తో ప్రభాస్ :
సాధారణంగా తన సినిమా ఫంక్షన్లు అయినా, బయటి కార్యక్రమాలే అయినా బ్లాక్ షర్ట్ లేదా టీషర్ట్‌తోనే డార్లింగ్ కనిపించేవారు. కానీ ఈసారి మాత్రం ఆయన సర్‌ప్రైజ్ ఇచ్చారు. పసుపు నీలం రంగుల కాంబినేషన్ షర్ట్ వేసుకుని సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. కొందరు నెటిజన్లు.. ప్రభాస్ వేసుకొచ్చిన షర్ట్ గురించి వెతికి ఎట్టకేలకు దానిని పట్టుకున్నారు. దాని పేరు ‘పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్’’. దీని ధర 115 పౌండ్లు. మన భారత కరెన్సీలో 11,618.09 రూపాయలుగా తెలుస్తోంది.
Darlings...
— ahavideoin (@ahavideoIN) December 13, 2022
Here's the most awaited and anticipated glimpse from #UnstoppableWithNBKS2??????. Idhi chinna glimpse matrame. Main promo thvaralo...??#NBKWithPrabhas#NandamuriBalakrishna#Prabhas@YoursGopichand pic.twitter.com/mi48GDygFc
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments