షాకింగ్: రూ.150 కోట్ల డీల్ వదులుకున్న ప్రభాస్.. నో ఎందుకు చెప్పాడంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజీ స్టార్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ తారాస్థాయికి చేరింది. బాలీవుడ్ తారలు సైతం చిన్నబోయేలా ప్రభాస్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు.
ఇదీ చదవండి: హాట్ టాపిక్ గా మారిన రవితేజ రెమ్యునరేషన్
క్రేజ్ ఉన్న స్టార్స్ దగ్గరికి కార్పొరేట్ సంస్థలు వాలిపోతుంటాయి. తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకోవడం కోసం స్టార్స్ ని తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కాంట్రాక్టు కుదుర్చుకుంటుంటాయి. క్రికెటర్లు, సినీ తారలు ఎక్కువగా బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులవుతూ ఉంటారు.
క్రికెట్ కు, సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ఎండార్స్మెంట్ కోసం ప్రభాస్ ని సంప్రదించాయట. ఇందులో కేవలం కొన్నింటికి మాత్రమే ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మిగిలినవన్నీ ప్రభాస్ రిజెక్ట్ చేశాడట.
అలా ప్రభాస్ గత ఏడాది కాలంగా రిజెక్ట్ చేసిన ఎండార్స్మెంట్ విలువ రూ 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్టులని ప్రభాస్ వదులుకోవడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం తాను ఎండార్స్ చేస్తున్న వాటిని కొనసాగిస్తూనే కొత్త బ్రాండ్స్ విషయంలో సెలెక్టివ్ గా ఉండాలని ప్రభాస్ భావిస్తున్నాడు.
తనకు ఉన్న అభిమానులని దృష్టిలో పెట్టుకుని అన్ని బ్రాండ్స్ ని ఓకే చేసేందుకు సిద్ధంగా ప్రభాస్ లేదు. అభిమానుల్లో తనపై నమ్మకం చిరకాలం కొనసాగేలా ఉండే బ్రాండ్స్ కి మాత్రమే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
ఇక వరుస సినిమాలతో బిజీగా ఉండడం కూడా ఓ కారణం. తన బిజీ షెడ్యూల్ దృష్ట్యా ప్రభాస్ అన్ని బ్రాండ్ కి ఓకే చెప్పడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com