ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. 3జి నెట్‌వర్క్ ఔట్!
Send us your feedback to audioarticles@vaarta.com
టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్ 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా తన మొత్తం 3 జి నెట్‌వర్క్‌ను మూసివేయాలని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కువ రియలైజేషన్ మరియు సగటు రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పై డ్రైవింగ్ పై రేజర్ పదునైన దృష్టి పెడుతున్నామని కంపెనీ తెలిపింది, అయితే సుంకాలు అవసరమని నొక్కి చెప్పారు. పరిశ్రమ సాధ్యత కోసం దీర్ఘకాలికంగా ముందుకు సాగండి.
2020 మార్చి నాటికి 3జీ కనపడదు!
భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ భారతి విజయవంతంగానే రాణిస్తోంది. అయితే అప్పుడప్పుడు సదరు యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలతో వినియోగదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. తాజగా ఉన్నట్టుండి ఒక్కసారిగా 3జి నెట్‌వర్క్‌ను మూసివేయాలని యోచిస్తున్నట్లు బాంబ్ పేల్చింది. దీంతో వినియోగదారులు కంగుతిన్నారు. అయితే 2020 మార్చి నాటికి 3జీ నెట్‌వర్క్ ప్రపంచ వ్యాప్తంగా మూసివేస్తామని ఎయిర్‌టెల్ యాజమాన్యం ప్రకటించింది. కాగా ప్రస్తుతం కోల్‌కత్తా నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని సౌతిండియా సీఈవో గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు.
గోపాల్ విట్టల్ మాటల్లోనే...
"3G లో దాదాపుగా ఎటువంటి ఖర్చు లేదు. భారతదేశంలో 50 శాతం అమ్మకాలు ఇప్పటికీ ఫీచర్ ఫోన్ల ఫై నడుస్తున్నాయి . కంపెనీ ఇప్పుడు 4జీ టెక్నాలజీ పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. వినియోగదారులు 2జీ మరియు 4జీ గా విభజించబడ్డారు.. ఎందుకంటే 3జీ టెక్నాలజీ అంత ఉపయోగకరంగా లేదు. ఇప్పటికే 8.4 మిలియన్ల వినియోగదారులు 4జీ.. ఉన్నారు" అని ఈ సందర్భంగా గోపాల్ విట్టల్ చెప్పుకొచ్చారు. సో.. టూ జీ నుంచి 4జీ అంతా అప్‌గ్రేడ్ చేసే పనిలో యాజమాన్యం నిమగ్నమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout