తెలంగాణలో షాకింగ్ కేసులు.. ప్రతి 4 టెస్టుల్లో ఒకటి కరోనా పాజిటివ్

  • IndiaGlitz, [Tuesday,June 23 2020]

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రతి నాలుగు టెస్టుల్లో ఒకటి పాజిటివ్ కావడం గమనార్హం. నిన్న 3189 శాంపిల్స్‌ను పరీక్షించగా వాటిలో 872 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8674కు చేరుకుంది. నిజానికి ఇంకా సరిగా టెస్టులు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి.

పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహిస్తే ఇంకెన్ని కేసులు నమోదవుతాయోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిన్న తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 217కు చేరుకుంది. ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్న వారు 4452 కాగా.. 4005 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

More News

బ‌న్నీకి భారీ రెమ్యున‌రేష‌న్‌..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త‌న రేంజ్‌ను క్ర‌మంగా పెంచుకుంటూ వ‌స్తున్నారు.

నానిని మ‌రోసారి ఫిదా చేయ‌నుందా?

నేటి త‌రం యువ క‌థానాయ‌కుల్లో నేచుర‌ల్ స్టార్ నాని ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న 25వ చిత్రం ‘వి’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

సమంత పాన్ ఇండియా మూవీ..?

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి.

బాల‌య్య హీరోయిన్‌కి అరుదైన అవార్డు

తెలుగు నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న లెజెండ్‌లో న‌టించిన న‌టి రాధికా ఆప్టే. ఆమెకు ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో అరుదైన అవార్డు ల‌భించింది.

మ‌హేశ్ ‘సర్కారు వారి పాట’లో చెర్రీ విల‌న్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.