వర్మ కనుగుడ్లు పీకే రోజే త్వరలోనే వస్తుంది!
- IndiaGlitz, [Tuesday,April 30 2019]
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మపై అలనాటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆర్జీవీ కనుగుడ్లు పీకే రోజు త్వరలోనే వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, లక్ష్మీ పార్వతి గురించి దివ్యవాణి మాట్లాడారు. గత నెలలో విడుదలైన ఈ సినిమా సంకనాకిపోయిందన్నారు. లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో ఆమె మొదటి భర్త వీరగంథం ఎప్పుడో చెప్పారని.. ఇటీవలే కోటి అనే యువకుడు కూడా తాను ఎలా వేధింపులకు గురైందీ సోషల్ మీడియాలో వెల్లడించాడని దివ్యవాణి పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చే సమయానికి ఆమేమీ పదహారేళ్ల బాలాకుమారి కాదని.. ఆమె కనీసం ఎన్టీఆర్ గారి వయసును కూడా గుర్తించకుండా స్టెరాయిడ్స్ ఇప్పించి చావుకు కారణమైందని సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి విషపు చుక్క. వర్మ వెనక జగన్.. విజయసాయిరెడ్డి ఉండి నడిపిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. వర్మ కనుగుడ్లు పీకే రోజు త్వరలోనే వస్తుందని.. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నారా వారి కుటుంబం, నందమూరి కుటుంబాలకు సంస్కారం ఉంది కాబట్టి ఆమె గురించి ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదన్నారు. అయినా ఎన్టీఆర్ గురించి సినిమా తీయడానికి బూతు దర్శకుడివైన నీకేం అర్హత ఉంది? అంటూ ఆర్జీవీపై దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు గుప్పించే వారికి సోషల్ మీడియా, మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ఆర్జీవీ.. దివ్యవాణి చేసిన సంచలన వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.