షాకింగ్: మర్కజ్ చీఫ్ ఆడియో టేపుల కలకలం.. రంగంలోకి దోవల్!
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల గురించే చర్చ. ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది కరోనా వైరస్ బారినపడినట్టు నిర్ధారణ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడీ నిజాముద్దీన్ వ్యవహారం వైరస్‌కు దేశంలోనే ప్రధాన కేంద్రంగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో అసలు మసీదులో దేశ విదేశాల నుంచి వచ్చిన వారంతా ఏం చేశారు..? ఏమేం మాట్లాడుకున్నారు..? ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు..? అనే విషయాలను ఆడియో టేపులను రిపబ్లిక్ టీవీ అనే జాతీయ మీడియా రాబట్టింది. అయితే.. ఈ ఆడియో టేపులు ఎక్కడ్నుంచి వచ్చాయ్..? ఎవరిచ్చారు..? అనేది బయటికి రాలేదు కానీ.. ప్రస్తుతం ఈ ఆడియో టేపులు మాత్రం సంచలనంగా మారాయి.
ఆడియో టేపుల్లో ఏముంది..!?
‘కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 70 వేల మంది చనిపోయారని చెబుతున్నారు. నిజానికి వాళ్లంతా దేవదూతలుగా మారారు. ఏ డాక్టరైనా మిమ్మల్ని రక్షించగలడా? ఆ 70 వేల మంది దేవదూతల్ని తానే సంక్షణలోకి తీసుకున్నానని సాక్ష్యాత్తూ భగవంతుడే చెబితే.. ప్రపంచంలోని ఏ శక్తయినా వ్యతిరేకించగలదా? క్వారంటైన్ విధానం ఫక్తు అంటరానితనం. ఇది భయాన్ని, అంటరానితనాన్ని వ్యాపించే సమయం కాదు. డాక్టర్ల మాట అసలే వినాల్సిన పనిలేదు. అన్నింటికంటే ముఖ్యంగా సామూహిక ప్రార్థనల్ని ఆపనే ఆపొద్దు. మనల్ని ఒక్కటిగా ఉండనీయకుండా కలిసి భోజం చేయనీయకుండా కుట్రలు సాగుతున్నాయి. వైరస్ లక్షణాలు కనిపించినా మీరు భయపడొద్దు. మునుపటికంటే సామూహిక ప్రార్థనలు బలంగా చేయండి. భార్యాబిడ్డలతో కలిసి బయటికి రండి.. కలిసుండటంలోనే బలముందని మర్చిపోకండి’ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు చీఫ్ మౌలానా సాద్ చెప్పినట్లుగా పేర్కొన్న ఆడియో, వీడియో టేపులు సంచలనం రేపుతున్నాయి. అయితే ఈ టేపులు ఎక్కడ్నుంచి లభించాయన్నది మాత్రం సదరు టీవీ చానెల్ చాలా గోప్యంగా ఉంచింది.
కేసు నమోదు.. రంగంలోకి దోవల్!
కాగా.. మర్కజ్ కేంద్రం వైరస్ హాట్ స్పాట్‌గా మారడానికి కారకులంటూ మతపెద్ద మౌలానా సాద్ అని.. ఆయనతో పాటు ఇతర గురువులపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897లోని సెక్షన్-3 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అరెస్టుకు ముందే మర్కజ్ చీఫ్ సాద్ పరారైపోయారు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే.. వైరస్ ప్రబలిన నేపథ్యంలో ముస్లిమ్ ఉలేమాలను ఆసుపత్రికి తరలించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రంగంలోకి దిగారు. నిజాముద్దీన్ మర్కజ్ లోని ఉన్న వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించేందుకు తబ్లిగ్ జమాత్ నేత మౌలానా సాద్ మొదట నిరాకరించారు. అయితే దోవల్ రంగంలోకి దిగడంతో.. వారిని ఆసుపత్రికి తరలించేందుకు అజిత్ డోబాల్ ముస్లిమ్ ఉలేమాలతో చర్చించి వారిని ఒప్పించారు. మసీదులోని వారందరికీ పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తరలించి, వైరస్ ప్రబలకుండా మసీదును శుభ్రపర్చారు. మొత్తంమీద 2300 మందిని మర్కజ్ నుంచి భద్రతాధికారులు ఖాళీ చేయించడం మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments