దిమ్మ తిరిగే సమాధానం...
- IndiaGlitz, [Sunday,March 24 2019]
అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోల రేంజ్‌కు చేరుకున్న విజయ్ దేవరకొండ, నిహారిక కొణిదెల పెళ్లి జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అందుకనే గీతాఆర్ట్స్ ఈ హీరోకు మద్దతుగా ఉంటుందని పలు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై మెగా కాంపౌండ్ స్పందించలేదు కానీ.. విజయ్‌దేవరకొండ తనదైన స్టైల్లో స్పందించారు. నిహారిక తండ్రి నాగబాబుతో నేను కలిసి పనిచేశానని.. ఆయనకు పెద్ద కొడుకులా భావిస్తాను.
వరుణ్ అన్న యు.ఎస్‌లో ఉండటంతో అన్న స్థానంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చానని కుండ బద్ధలు కొట్టేశాడు. గతంలో సాయిధరమ్‌తో కూడా నిహారిక పెళ్లి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో సాయిధరమ్ తాను వరుసకు బావే అయినా.. నిహారికను చెల్లెలుగా భావించానని సాయిధరమ్ అప్పట్లో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. నిహారికకు తాను బిగ్ బ్రదర్నని చెప్పి చెడు వార్తలను రాసిన వారందరికీ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు.