షాకింగ్.. చైనాలో మరో ప్రాణాంతక వైరస్..!
Send us your feedback to audioarticles@vaarta.com
చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచం నలువైపులా విసర్తిరించడంతో ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాలు దాటేసిన ఈ వైరస్ ఎప్పుడు ఎవర్ని సోకుతుందో..? ఎవరు దీని కాటుకు బలవుతారో తెలియని పరిస్థితి. ఏ నోటా విన్నా ఈ వైరస్ పేరే.. ఎక్కడా చూసినా ఈ వైరస్ భయమే. ఈ పేరెత్తితే చాలు జనాలు భీతిల్లిపోతున్నారు. అయితే.. ఈ వైరస్‌కు ఇంతవరకూ మందు లేకపోవడం.. పాజిటివ్ వచ్చిన వారు దాదాపు చనిపోతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో ఇండియాలో ఇప్పటికే ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించగా.. చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేసింది. అయితే ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఓ షాకింగ్ వార్త వెలుగుచూసింది.
ప్రాణాంతక వైరస్ ఇదీ..
అదేమిటంటే.. కరోనా వైరస్ అంతం కాకమునుపే మరో ప్రాణాంతక వైరస్ చైనాలో పుట్టింది. కరోనా ఎక్కడైతే పుట్టిందో.. అదే దేశంలోనే ఈ వైరస్ కూడా పుట్టడం గమనార్హం. ఆ వైరస్ పేరు ‘హంటా’. ఇది ప్రాణాంతక వైరస్ అని తెలుస్తోంది. ఈ వైరస్ కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. అంతేకాదు.. ఈ వైరస్‌తో చైనాలోని యునన్ ప్రావిన్సుల్లో ఓ వ్యక్తి మృత్యవాత పడ్డాడు. ఈ విషయం చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ వెల్లడించింది. అయితే ఈ వైరస్ కూడా కరోనా మాదిరే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందట. దీంతో చనిపోయిన ఆ వ్యక్తి బస్సులో ఎవరెవరు ప్రయాణించారు..? ఇంతకీ ఆ 32 మంది ప్రయాణికులకు ఎక్కడికెళ్లారు..? అనేదానిపై అక్కడి అధికారులు నానా తంటాలు పడుతున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ వైరస్‌కు సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఆ వైరస్ సోకితే ఎలా ఉంటుంది..? లక్షణాలేంటి..? అని నిశితంగా అందులో ఉంది.
ఎలా సోకుతుంది..?
ఈ ప్రాణాంతక ‘హాంటా’ వైరస్ వ్యాధికి ఎలుకలే కారణమని తెలుస్తోంది. ఇవే ప్రధాన వాహకాలు శాస్త్రవేత్తలు తేల్చారట. ‘ఇంటిలో, చుట్టుపక్కల పరిసరాల్లో ఎలుకల ఉంటే హాంటావైరస్ వ్యాపించే ప్రమాదంగా ఉంది. ఈ వైరస్ బారిన పడితే సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా హెచ్‌పిఎస్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది’ అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలుకల లాలాజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని షాకింగ్ విషయాన్ని తెలిపింది. చిలీ, అర్జెంటీనాలో అత్యంత అరుదైన కేసుల్లోనే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్టు తేలిందట. అంతేకాదు.. ఈ వైరస్ సోకిన వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అమెరికా సెంటర్ తెలిపింది.
లక్షణాలు ఇవీ..
- జ్వరం
- తలనొప్పి
- కండరాల నొప్పులు
- కడుపు నొప్పి
- వికారం
- వాంతులు
- మైకం
- విరేచనాలు
- ఉదర సంబంధ లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
చైనాలోనే ఎందుకిలా?
అయితే ఈ వైరస్ ప్రాణాంతకమైనదని కొందరు చెబుతుంటే అబ్బే కరోనా కంటే అస్సలు డేంజర్ కాదని చెబుతున్నారు. మరి దీనిపైన ఇంకా చైనా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రభుత్వం స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. పదే పదే ఏ కొత్త వైరస్ అయినా చైనాలోనే ఎందుకు పుడుతోంది..? ఆ వైరస్‌ను నిర్ధారించిన తర్వాత కచ్చితంగా మందు కనుగొనే అవకాశాలున్నాయ్.. మరి ఎందుకు చైనా అక్ష్యం వహిస్తోంది. అసలు చైనా టార్గెట్ ఏంటి..? ప్రపంచాన్ని చైనా ఏం చేయబోతోంది..? ఇదంతా చైనాలో ఇతర దేశాల పెట్టుబడులు పక్కనెట్టాలనే చేస్తోందా..? అనేది విశ్లేషకులు, వైద్య నిపుణులే తేల్చాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments