హుద్రోగులు, హై బీపీ ఉన్న వారికి షాకింగ్ న్యూస్..
- IndiaGlitz, [Friday,June 26 2020]
కరోనా నుంచి కోలుకున్న బాధితుడికి తిరిగి వచ్చే అవకాశం ఉందా? అంటే.. అలా అని ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలూ లేవని వైద్యులు చెబుతున్నారు. కానీ తాజా అధ్యయనాలు మాత్రం హుద్రోగులు, అధిక రక్తపోటు ఉన్నవారికి మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పాయి. వారికి కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా తిరిగి వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని చైనాలోని హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా తొలి జన్మస్థలమైన వూహాన్లో హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు 938 కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులపై పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనల్లో హృద్రోగంతోపాటు అధిక రక్తపోటు ఉన్నవారికి కరోనా నుంచి కోలుకున్న అనంతరం కూడా వైరస్ సోకే అవకాశం 58 శాతం ఉన్నట్టు గుర్తించారు. వారి శరీరంలో కరోనా నుంచి కోలుకున్న 44 రోజుల వరకూ వైరస్ ఆర్ఎన్ఏ ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందని హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.