బ్యాంక్ డిపాజిట్ దారులకు షాకింగ్ న్యూస్!

  • IndiaGlitz, [Tuesday,December 03 2019]

బ్యాంకు డిపాజిట్ దారులకు ఈ వార్త నిజంగానే షాకింగ్ అని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో ఉండే డిపాజిట్లకు లక్ష రూపాయలకు వరకు మాత్రం బీమా సదుపాయం ఉంటుందని డిపాజిట్ బీమా, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. కాగా ఇది రిజర్వు బ్యాంక్‌కు అనుబంధ సంస్థ అనే విషయం తెలిసిందే. కాగా ఈ బీమా వ్యవహారంపై ఓ ఓ ప్రముఖ మీడియా సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా ఓ ప్రశ్న అడగ్గా.. పై విధంగా సమాధానం వచ్చింది. కాగా.. డీఐసీజీసీ చట్టం ప్రకారం.. బ్యాంకులు విఫలమైనప్పుడు, నష్టాల్లో కూరుకున్నప్పుడు ఖాతాదారుల డిపాజిట్లపై డీఐసీజీసీ రూ. లక్ష వరకు బీమా కవరేజీ అందిస్తుందని స్పష్టం చేసింది. సేవింగ్ డిపాజట్లు, పిక్స్‌డ్ డిపాజిట్లు, కరెంటు ఖాతాలకు మాత్రమే ఇది వర్తించనుంది.

అయితే ఈ బీమా మొత్తం పెంచే అవకాశం ఉందన్నదానికి తమ వద్ద ఆ సమాచారం లేదని కార్పొరేషన్ తెలిపింది. కాగా.. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజిని పెంచేందుకు చట్టాలను తీసుకురానుందన్న వార్తల నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థ.. సహచట్టం ద్వారా సమాచారం కోరగా పై విధంగా సమాధానాలు వచ్చాయి.