అదే జరిగితే.. అనుష్క అభిమానులకిది షాకింగ్ న్యూసే..

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

పేరుకే అనుష్క అయినా అభిమానులు ఎక్కువగా ఆమె ముద్దుపేరుతోనే ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారు. అలాంటి స్వీటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇకపై సినిమాలకు స్వస్తి చెప్పి పెళ్లి పీటలెక్కబోతోందని సమాచారం. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడటం కూడా మొదలు పెట్టారనే టాక్ నడుస్తోంది. దీంతో అమ్మడు సినిమాలకు స్వస్తి చెప్పబోతోందట.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్’ సినిమా ద్వారా అనుష్క ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇప్పటి వరకూ ఈ ముద్దుగుమ్మను బీట్ చేయగల హీరోయిన్ టాలీవుడ్‌లో లేదంటే అతిశయోక్తి కాదు. ‘అరుధంతి, రుద్రమదేవి, భాగమతి’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం చేసి మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ‘బాహుబలి’ సినిమా అనుష్క కెరీర్‌కే మైలురాయి. తను చేసిన సినిమాలన్నింటి ద్వారా అనుష్క పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది.

అయితే ఇప్పటికి తాను సంపాదించుకున్న ఇమేజ్ చాలని.. ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నానని అనుష్క తన సన్నిహితులకు చెప్పినట్టు టాక్ నడుస్తోంది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క హీరోయిన్‌గా ‘నిశ్శబ్దం’ సినిమా తెరకెక్కుతోంది. మరి వస్తున్న టాక్ నిజమే అయితే ఈ సినిమానే అనుష్క లాస్ట్ సినిమా అవుతుందేమో.. ఏది ఏమైనా అనుష్క స్పందిస్తేనే ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడుతుంది.