ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. 3జి నెట్‌వర్క్ ఔట్!

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్ 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా తన మొత్తం 3 జి నెట్‌వర్క్‌ను మూసివేయాలని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కువ రియలైజేషన్ మరియు సగటు రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పై డ్రైవింగ్ పై రేజర్ పదునైన దృష్టి పెడుతున్నామని కంపెనీ తెలిపింది, అయితే సుంకాలు అవసరమని నొక్కి చెప్పారు. పరిశ్రమ సాధ్యత కోసం దీర్ఘకాలికంగా ముందుకు సాగండి.

 2020 మార్చి నాటికి 3జీ కనపడదు!

భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ భారతి విజయవంతంగానే రాణిస్తోంది. అయితే అప్పుడప్పుడు సదరు యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలతో వినియోగదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. తాజగా ఉన్నట్టుండి ఒక్కసారిగా 3జి నెట్‌వర్క్‌ను మూసివేయాలని యోచిస్తున్నట్లు బాంబ్ పేల్చింది. దీంతో వినియోగదారులు కంగుతిన్నారు. అయితే 2020 మార్చి నాటికి 3జీ నెట్‌వర్క్‌‌ ప్రపంచ వ్యాప్తంగా మూసివేస్తామని ఎయిర్‌టెల్ యాజమాన్యం ప్రకటించింది. కాగా ప్రస్తుతం కోల్‌కత్తా నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని సౌతిండియా సీఈవో గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు.

గోపాల్ విట్టల్ మాటల్లోనే...

 3G లో దాదాపుగా ఎటువంటి ఖర్చు లేదు. భారతదేశంలో 50 శాతం అమ్మకాలు ఇప్పటికీ ఫీచర్ ఫోన్ల ఫై నడుస్తున్నాయి . కంపెనీ ఇప్పుడు 4జీ టెక్నాలజీ  పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. వినియోగదారులు 2జీ మరియు 4జీ గా విభజించబడ్డారు.. ఎందుకంటే 3జీ టెక్నాలజీ అంత ఉపయోగకరంగా లేదు. ఇప్పటికే 8.4 మిలియన్ల వినియోగదారులు 4జీ.. ఉన్నారు అని ఈ సందర్భంగా గోపాల్ విట్టల్ చెప్పుకొచ్చారు. సో.. టూ జీ నుంచి 4జీ అంతా అప్‌గ్రేడ్ చేసే పనిలో యాజమాన్యం నిమగ్నమైంది.

More News

‘బాహుబలి’ కంటే ముందే ‘సాహో’ ప్లాన్ చేశా కానీ...!!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్ చేసేంతలా రోజురోజుకు అంచనాలు...

‘యాత్ర’ డైరెక్టర్ కొత్త సినిమా.. నిర్మాతగా పీవీపీ

‘ఆనందో బ్రహ్మ’ సినిమా కామెడీ పండించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ ఎమోషనల్‌గా టచ్ చేసిన మహి వి. రాఘవ్.. ఈ సారి ఏకంగా ‘సిండికేట్’ సినిమాతో వచ్చేస్తున్నారు.

'మిస్టర్‌ కిల్లర్‌' టీజర్‌ను విడుదల చేసిన అల్లరి నరేష్‌

రమేష్‌ స్టూడియోస్‌, శ్రీనిక్షిత ప్రొడక్షన్స్‌ పతాకాలపై చార్లెస్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్‌ తుమ్మలపల్లి నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మిస్టర్‌ కిల్లర్‌'. విశ్వ

ఉగ్రవాదంపై ఉక్కుపాదమే.. కీలక బిల్లుకు పెద్దలు ఆమోదం

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో భాగంగా దాయాదీ దేశాలను గజగజ వణికిస్తున్నప్పటికీ ఉగ్రమూకలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.

మెగాస్టార్ చిరు గురువు దేవదాస్ ఇకలేరు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. కాగా ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.