టిక్‌టాక్ అభిమానులకు షాకింగ్ న్యూస్...!

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. ఇకపై టిక్‌టాక్ కనిపించదు.! టిక్‌టాక్‌ను వెంటనే తమ ప్లేస్టోర్ల నుంచి తొలగించాలంటూ గూగుల్, యాపిల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ చైనీస్ వీడియో షేరింగ్ యాప్‌ను ఎందుకు తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి..? దీనివల్ల నష్టమేంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఆన్‌చేస్తే చాలు టిక్‌టాక్ వీడియోల నోటిఫికేషన్లు బోలెడు వస్తుంటాయ్.! మరోవైపు కొందరు టిక్‌టాక్‌‌ కోసం లేనిపోని వీడియోలన్నీ తీసి షేర్ చేస్తుంటారు. దీంతో పిల్లల్లో పెడధోరణులు పెరిగిపోతున్నాయని దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు.. మరోవైపు నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి.. తక్షణమే యాప్‌ను నిషేధించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.

అంతేకాదు ఈ యాప్ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయవద్దని మీడియాకు హైకోర్టు సూచించింది. చిన్నపిల్లలు సైబర్ నేరగాళ్ల బారినపడకుండా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి చర్యలు తీసుకున్నదీ ఏప్రిల్ 16లోగా తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో టిక్‌టాక్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇదిలా ఉంటే.. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. అయితే సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతున్నది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి చూస్తే ఇది టిక్‌టాక్ అభిమానులకు ఇదో షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.

More News

ఒక‌టి కాదు... రెండు దెయ్యాలు! మే 1న 'అభినేత్రి 2' విడుద‌ల‌

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన `అభినేత్రి` తెలుగులో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.

50 యూట్యూబ్ ఛానల్స్‌ పై నటి పూనమ్‌కౌర్ ఫిర్యాదు

గత కొన్ని రోజులుగా హీరోయిన్ పూనమ్‌కౌర్‌కు సంబంధించిన కొన్ని ఆడియో, వీడియోలు యూట్యూబ్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సీజన్ కావడంతో కొన్ని వర్గాలు

'ఎర్రచీర' షూటింగ్ ప్రారంభం

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై సిహెచ్‌. సుమన్‌ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. ఈ చిత్రం సోమవారంనాడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

వృద్ధాప్యం మ‌న‌సుకు కాదు

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ ఇంకా త‌గ్గ‌లేదు. క్రీడా రంగానికి సంబంధించి మ‌రో బ‌యోపిక్ `సాండ్ కీ అంఖ్‌`త్వ‌రలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కేర‌ళ‌కు సైరా

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' షూటింగ్ జ‌రుగుతోంది. సినిమాలో కీల‌క పోరాట స‌న్నివేశాల కోసం మొత్తం యూనిట్ కేర‌ళ‌కు వెళ్లింది.