మోదీ ప్రమాణం చేసిన మరుసటి రోజే షాకింగ్ న్యూస్!
- IndiaGlitz, [Friday,May 31 2019]
ఇండియా అభివృద్ధి చెందుతోంది.. తగు సంక్షేమ పథకాలు పేదలకు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నాం.. తీసుకున్నామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలన్నీ వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయే తప్ప ఏ మాత్రం ఆచరణలోకి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఏటేటా విడుదలవుతున్న గణంకాలను చూస్తే నిపుణులు షాకవుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. భారీ మెజార్టీతో రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే.. లేబర్ మంత్రిత్వశాఖ విభాగం షాకింగ్ న్యూస్ చెప్పింది.
అదేదో సామెత ఉందిగా.. చావు చల్లగా చెప్పినట్లు ఇదిగో మంత్రిత్వ శాఖ తీరు కూడా అలాగే ఉంది. దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది దేశంలో 45 ఏళ్లలో అధికమని పేర్కొనడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం పట్టణ యువతలో 7.8 శాతం మంది నిరుద్యోగం ఉందని.. గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం మంది నిరుద్యోగ రేటు ఉందని ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో మగవాళ్ళలో 6.2%, మహిళల విషయంలో 5.7 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని తేలింది.
కాగా.. ప్రస్తుతం దేశంలో 6.1 శాతం నిరుద్యోగం ఉందని బిజినెస్ స్టాండర్ట్ ఇదివరకే ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం ఇదంతా అబద్ధమనేని అప్పట్లో తోసిపుచ్చింది. కానీ ఇన్నాళ్లకు అదే రిపోర్టు కాపీ అక్షరాలా విడుదల చేయడం గమనార్హం.