షాకింగ్.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 7998 కేసులు
- IndiaGlitz, [Thursday,July 23 2020]
ఏపీలో షాకింగ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఏపీకి సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 58,052 పరీక్షలు నిర్వహించగా.. 7998 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 72,711కు చేరుకుంది. 61 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 884 మంది మృతి చెందారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 34272 యాక్టివ్ కేసులుండగా.. 37555 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నేడు కరోనా కారణంగా తూర్పు గోదావరిలో 14 మంది, గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఏడుగురు, కృష్ణాలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఒక్కరు, అనంతపూర్‌లో ఒకరు మరణించారు. నేటి వరకూ ఏపీలో 14,93,879 శాంపిల్స్‌ని పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 23/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 23, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 69,816 పాజిటివ్ కేసు లకు గాను
*34,818 మంది డిశ్చార్జ్ కాగా
*884 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 34,114#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/9Gpgw5LPJ7