షాకింగ్: ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు.. ప్రభుత్వాలకు వారథిలా.. మరీ ముఖ్యంగా ప్రజలను నిత్యం చైతన్యపరుస్తుండే పాత్రికేయులను కూడా ఈ వైరస్ వదలట్లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు.. పలు ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసులకు, అలుపెరగని విధంగా ప్రాణాలకు తెగించి మరీ వైద్యం అందిస్తున్న డాక్టర్స్.. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బందినీ కరోనా వదలట్లేదు. తాజాగా ముంబైలోను పాత్రికేయులుగా పనిచేస్తున్న 53 మందికి కరోనా వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. అయితే వీరిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో అసలేం జరిగి ఉంటుందని తోటి పాత్రికేయులు.. ఆయా మీడియా సంస్థలు అలెర్ట్ అయ్యాయి. ఇవాళ మొత్తం 170 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా 53 మందికి కరోనా అని వైద్యులు తేల్చారు.
ఎలా వచ్చింది!?
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో మొదట్నుంచే కేసులు ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 16వేలకు పైగా కరోనా కేసులుంటే.. మరణాలు సైతం అలానే ఉన్నాయి. తాజాగా.. ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఎక్కడికంటే అక్కడికి కవరేజింగ్‌కు వెళ్లిన 52 మీడియా ప్రతినిధులకు కరోనా రావడం.. అసలు వారికి ఎక్కడ్నుంచి వచ్చింది..? ఎలా వచ్చిందనే దానిపై అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులు కోవిడ్ బారిన పడినట్లు సమాచారం. ముగ్గురు జర్నలిస్టులకు కరోనా సోకినట్లు తేలడంతో.. చెన్నైలోని మిగతా జర్నలిస్టులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
జర్నలిస్ట్ గిల్డ్..
జర్నలిస్టులకు కూడా కరోనా సోకడం ప్రారంభించడంతో బయట రిపోర్టింగ్ వెళ్లేవాళ్లకు కరోనా లక్షణాలు కనిపిస్తే రెస్ట్ తీసుకోవాలని.. వారిని అన్ని విధాలా మీడియా సంస్థల యాజమాన్యాలు ఆదుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కోరుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com