షాకింగ్..: ఇవాళ ఒక్కరోజే తెలంగాణలో 50 కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 50 ‘కరోనా’ పాజిటివ్ కేసులు నమోదవ్వడం షాకింగ్ గురి చేస్తోంది. ఇవాళ నమోదైన కేసులతో సహా ఇప్పటి వరకు మొత్తం 700 కేసులు నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఇవాళ ‘కరోనా’ మరణం నమోదు కాలేదని, ఈ వైరస్ బారి నుంచి కోలుకున్న 68 మందిని డిశ్చార్జి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పది వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, హైదరాబాద్‌లో ఈ రోజు 800 నమూనాలు పరీక్షించినట్టు చెప్పారు. నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లొచ్చిన వారేనని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే..

రాష్ట్రంలోని నమోదైన మొత్తం కేసుల సంఖ్య 534. పాజిటివ్ కేసులకు గాను 20 మంది డిశ్చార్జ్ కాగా.. 14 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 500. ఇవాళ ఉదయం 09 వరకు జరిగిన కొత్తగా కృష్ణా జిల్లాలో-03, కర్నూల్ జిల్లాలో-03, పశ్చిమ గోదావరి జిల్లాలో -03 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో అత్యధికంగా 122 కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాతి స్థానంలో 113 కేసులతో కర్నూలు రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉండటం గమనార్హం.

More News

కంగనా రనౌత్ సోదరికి షాకిచ్చిన ట్విట్టర్!

అవును మీరు వింటున్నది నిజమే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విట్టర్ అకౌంట్‌ను యాజమాన్యం నిలిపివేసింది.

రామ్‌ చరణ్‌తో ఫన్నీగా మాట్లాడిన కేటీఆర్..!

అవునా ఇదేంటి.. ఈ ఇద్దరి మధ్య ఏం టాఫిక్ వచ్చిందబ్బా..? అని అనుకుంటున్నారా..? మీరు వింటున్నది నిజమే.. కానీ ఇక్కడ సినిమాలో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాదండోయ్..

బోయ‌పాటి వెన‌క‌డుగు..!!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా

సూర్య కమిట్‌మెంటే వేర‌ప్పా!!

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.

బ‌న్నీ త‌దుప‌రి సినిమా ఆ ద‌ర్శ‌కుడితోనేనా?

బ‌న్నీ త‌దుప‌రి సినిమాల‌ను భారీ ప్లాన్‌తోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పాన్ ఇండియా