ఏపీలో షాక్.. ఒక్కరోజే దాదాపు 4 వేల కరోనా కేసులు

  • IndiaGlitz, [Saturday,July 18 2020]

ఏపీలో కరోనా కేసులు షాక్ ఇచ్చాయి. 2500 కేసులు నమోదవుతుంటేనే జనం భయపడిపోతుంటే.. ఇవాళ ఒక్కరోజే దాదాపు నాలుగు వేల కేసులు నమోదయ్యాయి. శనివారం కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 3963 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఏపీలో ఇదే ప్రథమం. దీంతో ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కేసుల సంఖ్య 44,609కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది.

ఇవాళ ఒక్కరోజే కరోనా కారణంగా 52 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ 589 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ప్రస్తుతం ఏపీలో 22,260 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని 21,763 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఈ రోజు నమోదైన కేసుల్లో అత్యధికంగా 994 కేసులు తూర్పు గోదావరి జిల్లాలో నమోదయ్యాయి. ఆ తరువాత ఎక్కువగా కర్నూలు జిల్లాలో 550 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో 407 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

అది నాకే తెలుసు.. అందుకే నా బయోపిక్‌లో నేనే హీరో: సోనూసూద్

ఎవరి బయోపిక్‌లో వారే నటిస్తే.. ఆలోచనే వినూత్నంగా ఉంది కదా..

ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కనున్న నితిన్, షాలిని జంట.. డేట్ ఫిక్స్

యంగ్ హీరో నితిన్‌ పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెలలోనే నితిని, షాలినిల జంట పెళ్లి పీటలెక్కనుంది.

ప్ర‌భాస్ 21కి మ్యూజిక్ డైరెక్ట‌ర్ దొరికేశాడు!!

‘బాహుబ‌లి’ రెండు పార్టులు విడుద‌లైన త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ఈ హీరో నేష‌న‌ల్ రేంజ్‌లో మార్కెట్‌ను పెంచుకున్నాడు.

మెగా ‘లూసిఫ‌ర్’ ఆగిందా?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’‌ను రీమేక్ చేయ‌డానికి ఎప్ప‌టి నుండో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఇస్మార్ట్ శంక‌ర్‌కు ఏడాది పూర్తి!!

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’.