షాకింగ్.. 2021 మరీ భయానకంగా ఉంటుందట..

  • IndiaGlitz, [Saturday,January 09 2021]

2020.. సమస్త ప్రజానీకం జీవితంలో కల్లోలం రేపింది. ప్రపంచాన్ని స్తంభింపజేసింది. అంతేనా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసింది. మానవ సంబంధాలను తెంపేసింది. పండుగ చేసుకున్నా సింగిల్ గానే.. పార్టీ చేసుకున్నా సింగిల్ గానే.. చివరకు పెళ్లి.. చావు అన్నీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే.. హంగూ ఆర్భాటాల్లేవు.. మంది మార్బలం అంతకన్నా లేదు. ఇక 2021 వస్తూ వస్తూనే గుడ్ న్యూస్‌ని మోసుకొచ్చింది. కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. భయపడాల్సిన పని లేదని చెప్పింది. దీంతో అంతా గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉన్నారు. కానీ మన ప్రశాంతతను భగ్నం చేస్తూ ఓ న్యూస్.

కోట్లాది మంది చనిపోతారు...

అదేంటంటే.. 2020 కంటే భయానకమైన పరిస్థితిని 2021లో చూడబోతున్నామట. ఇది చెప్పింది ఎవరో కాదు.. ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్. 465 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ భవిష్యవాణిలో 2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉంటుందని చెప్పారు. 2020-21కి సంబంధించి ఆయన చెప్పిన జోస్యంలో.. వర్షం, రక్తం, పాలు, కరువు, దొంగతనాలు, ఓ మహమ్మారి అనేవి విజృంభిస్తాయని వెల్లడించారు. అలాగే వీటి బారిన పడి కోట్ల మంది చనిపోతారని... ఎందరో తల్లులు, తండ్రులు మరణిస్తారని తెలిపారు. బతికున్న వారు సగం చనిపోయిన వారిలా మిగిలిపోతారని వెల్లడించారు. వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయని... ఆకాశం ఎర్రగా మారుతుందని తెలిపారు. కాంతి వంతమైన తోక కలిగిన ఓ కిరణం విశ్వం నుంచి భూమికి చేరుతుంది. ఎక్కడ చూసినా కరువు ఏర్పడుతుందంటూ 20వ శతాబ్దానికి సంబంధించి ఆయన భవిష్యవాణి చెప్పారు.

దారుణమైన కరువు పరిస్థితులు..

నోస్ట్రడామస్ చెప్పిన దాని ప్రకారం.. 2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నోస్ట్రడామస్ చెప్పిన ప్రకారం చూస్తే.. కరోనా మహమ్మారితో అయితే 2021లో పెద్ద ప్రమాదమేమీ లేదు కానీ.. దాని తరువాత ప్రపంచ వ్యాప్తంగా దారుణమైన కరువు పరిస్థితులు మాత్రం ఏర్పడే అవకాశముంది. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా వెల్లడించింది. ఇక ప్యారిస్‌లోని ఐఫిల్ టవర్ సైజులో ఉన్న ఓ భారీ ఉల్క భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇది భూమిడి ఢీకొట్టే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. అది భూమిని దాటే వరకు ప్రమాదం పొంచి ఉన్నట్లేనని చెబుతున్నారు. ఈ ఏడాది సౌర తుఫానులు భారీగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు వాతావరణంలో భారీ మార్పుల కారణంగా భూ భ్రమణ వేగం కూడా పెరిగింది.

చాలా వరకూ నిజమయ్యాయి...

నోస్ట్రడామస్ ఎప్పుడో ఏదో చెప్పారు.. దానిని పట్టుకుని వేలాడాల్సిన అవసరముందా? అనే సందేహం రావొచ్చు. కానీ ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకూ నిజమైన కారణంగా నమ్మాల్సిన అవసరమైతే ఉందని పలువురు చెబుతున్నారు. హిట్లర్ నియంతృత్వం... అమెరికా మాజీ అధ్యక్షుడి హత్య... 9/11 ట్విన్ టవర్స్ ఎటాక్.. అమెరికాలోని అతిపెద్ద భూకంపం.. ఇలా ఎన్నో విషయాల గురించి 465 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో చెప్పారు. వీటితో పాటు ప్రస్తుతమున్న పరిస్థితులను కూడా ఆయన తన భవిష్యవాణిలో చెప్పారు. 2020లో ఓ గుర్తు తెలియని మహమ్మారి విజృంభించి కోట్ల మంది ప్రాణాలను బలిగొంటుందన విషయాన్ని ఆయన నాడే స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగిపోయిందనుకుంటే.. 2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉంటుందని నోస్ట్రడామస్ భవిష్యవాణిలో ఉండడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం.

More News

ఆఖ‌రి షెడ్యూల్ లో  హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్  ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం

హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్ ప‌తాకంపై రోన‌క్ కాటుకూరి, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ ద‌ర్శ‌క‌త్వంలో పి.ఉద‌య్ కిర‌ణ్ నిర్మిస్తోన్న ప్రొడ‌క్ష‌న్  నెం-1 చిత్రం

మహేష్‌కి వదినగా నటిస్తున్నారనే వార్తపై రేణు దేశాయ్ క్లారిటీ..

ప్రముఖ నటి రేణూ దేశాయ్.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీ అవుతూ వస్తున్నారు. ఇటీవలే ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు

దేశంలో విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటంటే..

దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రతాపాన్ని చూపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది.

మస్క్ ట్వీట్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఒక్క ట్వీట్‌తో రేపిన దుమారం అంతా ఇంతా కాదు.

థియేట‌ర్స్ ఆక్యుపెన్సీ.. కేంద్రానికి లేఖ రాసిన ఎఫ్ఎఫ్ఐ

పండ‌గ‌లు వ‌చ్చేస్తున్నాయి. కానీ కోవిడ్ ప్ర‌భావం నుండి థియేట‌ర్స్‌కు ఇంకా విముక్తి దొర‌క‌డం లేదు.