హైకోర్టులో విజయశాంతికి షాక్.. ప్రభుత్వ భూముల వివాదం!

  • IndiaGlitz, [Thursday,July 15 2021]

లేడి సూపర్ స్టార్, బిజెపి నేత విజయశాంతికి హైకోర్టులో షాక్ తగిలింది. ప్రభుత్వ భూముల వేలం వివాదంలో విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోకాపేట, ఖానమెట్ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధపడిన సంగతి తెలిసిందే. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ప్రభుత్వం రెడీ అవుతున్న తరుణంలో విజయశాంతి హైకోర్టుని ఆశ్రయించారు.

వేలం ఆపాలని పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ భూముల వేలాన్ని ఆపలేమని కోర్టు తేల్చి చెప్పేసింది. భూముల వేలానికి సంబంధించిన జీవో 13 రద్దు చేయాలని విజయశాంతి కోర్టుని కోరారు. అయితే వేలంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

ఆ భూములు దురాక్రమణకు గురవుతున్నాయని, అందుకే వేలం వేస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ పై మాత్రం హై కోర్టు అక్షింతలు చల్లింది. ప్రభుత్వమే భూములని కాపాడుకోలేకపోవడం ఏంటని ప్రశ్నించింది. 2015 ఆదేశాలకు అనుగుణంగానే కోర్టు ఈ వేలానికి అనుమతి ఇచ్చిందని విజయశాంతి అన్నారు.

వెయ్యి ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుపై వాదనలు వినాల్సి ఉందని కోర్టు తెలిపింది. అయితే విజయశాంతి మాత్రం ఆ భూములని ఎవరూ కొనవద్దని అంటున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరగాల్సి ఉందని అన్నారు. భూముల వేలానికి కోర్టు అనుమతి ఇచినప్పటికీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని విజయశాంతి అన్నారు.

More News

అప్పట్లో స్టార్ క్రికెటర్ తో.. ఇప్పుడు టెన్నిస్ స్టార్ తో.. ఐటం బ్యూటీ ఎఫైర్

హాట్ బ్యూటీ కిమ్ శర్మ తన కెరీర్ మొత్తం వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూనే వచ్చింది.

RRR: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్.. ఒక్క పాటకు రూ.3 కోట్లు

దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్.

నవీన్ పోలిశెట్టి, అనుష్క మూవీ ఆగిపోయిందా?

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు లాంటి సూపర్ హిట్ మూవీస్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న నవీన్ పోలిశెట్టి క్రేజీ హీరోగా మారిపోయాడు.

గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం!

తాను సినీ నటిని అని చెప్పుకుంటున్న యువత సునీత బోయ మరోసారి గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట హల్ చల్ చేసింది.

ఆనంద్ దేవరకొండ, వైరల్ బ్యూటీ జంటగా.. సెట్స్ పైకి 'హైవే'

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం షురూ అయింది.