హైకోర్టులో విజయశాంతికి షాక్.. ప్రభుత్వ భూముల వివాదం!
Send us your feedback to audioarticles@vaarta.com
లేడి సూపర్ స్టార్, బిజెపి నేత విజయశాంతికి హైకోర్టులో షాక్ తగిలింది. ప్రభుత్వ భూముల వేలం వివాదంలో విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోకాపేట, ఖానమెట్ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధపడిన సంగతి తెలిసిందే. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ప్రభుత్వం రెడీ అవుతున్న తరుణంలో విజయశాంతి హైకోర్టుని ఆశ్రయించారు.
వేలం ఆపాలని పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ భూముల వేలాన్ని ఆపలేమని కోర్టు తేల్చి చెప్పేసింది. భూముల వేలానికి సంబంధించిన జీవో 13 రద్దు చేయాలని విజయశాంతి కోర్టుని కోరారు. అయితే వేలంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
ఆ భూములు దురాక్రమణకు గురవుతున్నాయని, అందుకే వేలం వేస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ పై మాత్రం హై కోర్టు అక్షింతలు చల్లింది. ప్రభుత్వమే భూములని కాపాడుకోలేకపోవడం ఏంటని ప్రశ్నించింది. 2015 ఆదేశాలకు అనుగుణంగానే కోర్టు ఈ వేలానికి అనుమతి ఇచ్చిందని విజయశాంతి అన్నారు.
వెయ్యి ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుపై వాదనలు వినాల్సి ఉందని కోర్టు తెలిపింది. అయితే విజయశాంతి మాత్రం ఆ భూములని ఎవరూ కొనవద్దని అంటున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరగాల్సి ఉందని అన్నారు. భూముల వేలానికి కోర్టు అనుమతి ఇచినప్పటికీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని విజయశాంతి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments