Venkatesh, Rana: వెంకటేశ్, రానాలకు షాక్.. పోలీస్ కేసుకు కోర్టు ఆదేశం

  • IndiaGlitz, [Monday,January 29 2024]

స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్‌(Venkatesh)ఆయన సోదరుడు దగ్గుబాటి సురేశ్‌ బాబుకు నాంపల్లి కోర్టులో గట్టి షాక్ తగిలింది. ఇద్దరితో పాటు రానా(Rana), అభిరామ్‌లపై పోలీసు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారని నందకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపింది. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్‌ను అక్రమంగా ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై.. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను కూల్చేశారని తెలిపారు. దీంతో తనకు రూ.20కోట్ల నష్టం వాటిల్లిందని వాపోయారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారందరిపై ఐపీసీ సెక్షన్ 448, 452,380, 506,120b కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన పెద్ద కుటుంబ సభ్యులపై పోలీసు కేసు నమోదుచేయాలని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే వెంకటేష్, సురేష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల వెంకీ మామ తన 75వ చిత్రం 'సైంధవ్' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడంతో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఇక రానా సీనియర్ దర్శకడు తేజతో ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అభిరామ్ ఇటీవల 'అహింస' చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది.

More News

Sharmila:షర్మిలతో వివేకా కూతురు సునీత భేటీ.. కాంగ్రెస్‌లో చేరే అవకాశం..!

ఏపీ రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన షర్మిల..

Venu Father: సీనియర్ నటుడు వేణు ఇంట్లో విషాదం.. ఆయన తండ్రి కన్నుమూత

సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి(Venu Thottempudi) కుటుంబలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకటసుబ్బారావు ఇవాళ ఉదయం కన్నుమూశారు.

Galla Jayadev: రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై.. ఎందుకంటే..?

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని ప్రకటించారు.

బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. NDAలో చేరేందుకు సిద్ధం..

ఊహించిందే జరిగింది. లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అందరూ అనుకున్నట్లుగానే బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌కు తన రాజీనామా

Telangana Good News:తెలంగాణ ఆడబిడ్డలకు శుభవార్త.. త్వరలోనే నగదుతో పాటు తులం బంగారం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా అమలుచేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)అడుగులు వేస్తున్నారు.