ట్రంప్‌కు ఊహించని ఝలక్.. ఇండియన్స్‌కు తియ్యటి శుభవార్త
Send us your feedback to audioarticles@vaarta.com
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగావకాశాన్ని కల్పిస్తూ ఒబమా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను ట్రంప్ రద్దుచేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్‌లో పిల్ దాఖలయ్యింది. దీన్ని సుధీర్ఘంగా విచారణ చేపట్టిన కోర్టు.. ట్రంప్ సర్కార్ ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని దిగువ కోర్టును కోరిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్.. క్షుణ్నంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని సూచించింది. అప్పటి వరకు నిబంధనలను నిలుపుదల చేయడం ఉత్తమమని పేర్కొంది. అంటే.. అమెరికాలో ఉంటున్న మనోళ్లకు అక్కడి కోర్టు ఊరట కలిగించే తీర్పు అన్న మాట. ఈ తీర్పుతో హెచ్1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న వారి స్పౌస్ (భార్య లేదా భర్త) కూడా పనిచేసుకోవచ్చన్న చెప్పిందన్న మాట. ఈ తీర్పు నిజంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఝలక్ అని చెప్పుకోవచ్చు. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ఇచ్చేదాకా ఒబామా హయాంలో తీసుకొచ్చిన పాలసీనే కొనసాగించాలని ఆదేశించింది.
వాస్తవానికి అమెరికాలోని హెచ్1 బీ వీసా హోల్డర్లలో మనోళ్ల సంఖ్యే ఎక్కువ. కోర్టు తాజా ఆదేశాలతో వారి లైఫ్ పార్ట్నర్లు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలిగింది. అమెరికన్ కంపెనీలు విదేశాలకు చెందిన నిపుణులకు ఉద్యోగమివ్వడానికి హెచ్ 1 బీ వీసా తప్పనిసరి. ఈ వీసాతో అమెరికా చేరిన వారిని నాన్ ఇమిగ్రెంట్లుగా పరిగణిస్తారన్న విషయం విదితమే. అయితే కోర్టు తీర్పుతో హెచ్4 వీసా హోల్డర్లకు వర్క్ పర్మిట్ ఇవ్వడంపై అమెరికన్లు ఆందోళనలు చేశారు. ‘సేవ్స్ జాబ్స్యూఎస్ఏ’ సహా అమెరికాలోని పలు సంస్థలు కోర్టుకెక్కాయి. స్థానికులకు ఉపాధి పోతోందని ఆరోపించాయి. మరి ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో..? ఎలా వస్తుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments