చేపల వేటకు వెళ్లిన వారికి షాక్... బీచ్‌లో కొట్టుకొచ్చిన బంగారం
Send us your feedback to audioarticles@vaarta.com
చేపల వేటే వారికి జీవనాధారం.. వాటిని పట్టుకుని అమ్మితేనే రోజు గడుస్తుంది. ఎప్పటిలాగే మత్స్యకారులంతా ఆ రోజు కూడా చేపల వేటకు వెళ్లారు. తమ వలకు చేపలు చిక్కుతాయనే ఆశతో సముద్రం వైపు అడుగులేశారు. అక్కడికి వెళ్లాక షాక్ అయ్యారు. బీచ్‌లో బంగారం, వెండి కణికలు లభించాయి. దీంతో అసలు తాము ఎందుకోసం వచ్చామో కూడా మరచిపోయారు. అసలేం జరిగిందంటే...
వెనిజులాలోని గాకా బీచ్.. చేపల వేటకని వెళ్లిన మత్స్యకారులకు అత్యంత విలువైన బంగారం, వెండి ఆభరణాలు దొరికాయి. అవి సముద్రంలో నుంచి కొట్టుకొచ్చాయని తెలుసుకుని వారంతా ఆశ్చర్యపోయారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న అక్కడి ప్రజలకు ఇది వరంగా మారింది. దీంతో బీచ్‌కి వెళ్లిన మత్స్యకారులంతా బంగారం, వెండి కోసం ఎగబడ్డారు. దొరికిన వాటిని దొరికినట్లు తీసుకుని వెళ్లిపోయారు. కొందరైతే వాటిని భారీ ధరలకు అమ్మేసుకున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వస్తువు లభించిందట.
కాగా.. తమకు దొరికిన వస్తువులను చాలా మంది అత్యధికంగా 1500 డాలర్లకు అమ్ముకున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన స్థానిక మత్స్యకారులు... తమ జీవితంలో ఇలాంటి ఘటనను ఎన్నడూ చూడలేదని, విషయం తెలియగానే ఆశ్చర్యపోయామని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. 2019 సెప్టెంబరులో తొలిసారి ఈ విశేషాన్ని స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో ఒక్కొక్కరూ దాదాపు రూ. లక్షన్నర చొప్పున సంపాదించారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout