టీడీపీకి షాక్.. విజయసాయిరెడ్డికి టచ్‌లో కీలకనేత!

  • IndiaGlitz, [Thursday,September 26 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి అన్నీ గడ్డురోజులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్న, ఉద్ధండ నేతలంతా టీడీపీకి టాటా చెప్పేసి అటు వైసీపీ.. ఇటు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే సిట్టింగ్‌లు కూడా పార్టీ మారడంతో ఏం చేయాలో..? ఎలా ముందుకెళ్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఓ వైపు కీలక నేతల ఆకస్మిక మరణాలు.. మరోవైపు ఇలా నేతల పార్టీలు మారడాలతో టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

రంగం సిద్ధం చేసిన రమేష్!
సరిగ్గా ఇదే సమయంలో మరో కీలక నేత టీడీపీకి టాటా చెప్పేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, గత ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్టుపై పోటీ చేసి ఓటమిపాలైన పంచకర్ల రమేష్‌బాబు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం రమేష్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

నంబర్-02తో మంతనాలు!
అయితే ప్రస్తుతానికి పార్టీ పరిస్థితి సర్లేదని.. ఇక మున్ముంథు ఈ దెబ్బల నుంచి కోలుకోవడం కష్టమని భావించిన ఆయన.. వైసీపీలో చేరాలని నిర్ణయించారట. అందుకే వైసీపీలో నంబర్-02గా పేరుగాంచిన, రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డితో టచ్‌లో ఉంటూ పార్టీ మారేందుకు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకూ.. విజయసాయి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయ దశమికి టీడీపీ కండువా తీసేసి.. వైసీపీ కండువా కప్పుకోవాలని రమేష్ బాబు నిర్ణయించారని తెలుస్తో్ంది.

రెండుసార్లు ఎమ్మెల్యేగా..!
రమేష్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో 2009లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన.. పెందుర్తి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో యలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి టీడీపీ టికెట్టు ఆశించినా అధిష్ఠానం గంటాకు ఆ స్థానం కేటాయించడంతో యలమంచిలి నుంచే పోటీ చేయక తప్పలేదు. దీంతో వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమిపాలయ్యారు.

త్వరలో గంటా కూడా!
కాగా.. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ముఖ్య అనుచరుడిగా.. ఆయన రైట్ హ్యాండ్‌గా రమేష్ ఉంటూ వస్తున్నారు. అయితే రమేష్ చేరిక అనంతరం గంటా కూడా టీడీపీకి టాటా చెబుతారని తెలుస్తోంది. అందుకే ముందుగా అనుచరుడిని పంపి.. ఆ తర్వాత తాను కండువా కప్పుకోవాలని గంటా భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ చేరికలు ఎక్కడి దాకా వెళ్తాయో..? ఎంతమంది కండువాలు మార్చేస్తారో..? వేచి చూడాల్సిందే మరి.

More News

'మళ్ళీ మళ్ళీ చూశా' ట్రైలర్ లాంచ్‌

అనురాగ్ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో

వైభవంగా సంతోషం అవార్డ్స్‌ 17వ వార్షికోత్సవ కర్టెన్‌రైజర్‌

'సంతోషం సౌతిండియా 17వ అవార్డుల' కర్టెన్‌ రైజర్‌ బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. జూబ్లీహిల్స్‌లోని పాస్తా రాస్తాలో జరిగిన ఈ వేడుకకు

మ‌ళ్లీ థియేట‌ర్స్‌లోకి `ఇస్మార్ట్ శంక‌ర్‌`

ఈ ఏడాది సూప‌ర్‌హిట్ అయిన చిత్రాల్లో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎనర్టిటిక్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఒక‌టి.

టీజర్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

‘‘సినిమా టీజర్‌ చాలా బావుంది. ఖచ్చితంగా ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీలవుతారు’’ అంటున్నారు టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.

`సైరా నర‌సింహారెడ్డి` ట్రైల‌ర్ 2:  గ‌డ్డిప‌ర‌క కూడా గ‌డ్డ దాట‌కూడ‌దు

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 2న