ప్రియాంక చోప్రాకు షాక్‌

  • IndiaGlitz, [Friday,December 27 2019]

బాలీవుడ్ నుండి హాలీవుడ్‌లో అడుగుపెట్టి.. నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకుంది ప్రియాంక చోప్రా. త‌ర్వాత స్కై ఈజ్ పింక్ అనే సినిమాలో న‌టించింది. తాజాగా ఈమె ఓ బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్స్ న‌డుస్తున్న త‌రుణంలో త‌న‌కున్న క్రేజ్ దృష్ట్యా తాను బ‌యోపిక్ చేస్తే స‌క్సెస్ అవుతాన‌ని గ‌ట్టిగా న‌మ్మింది. అందులో భాగంగా ఓషో శిష్యురాలు మా ఆనంద్ షీలా క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించింది. అందులో న‌టించ‌డ‌మే కాదు..తాను సినిమాకు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని ప్రియాంక తెలియ‌జేసింది. అయితే ఈ బ‌యోపిక్‌కి ప్రారంభంలోనే పెద్ద షాక్ త‌గిలింది.

త‌న బ‌యోపిక్‌లో ప్రియాంక చోప్రా న‌టించ‌డానికి వీల్లేందంటూ మా ఆనంద్ షీలా లీగ‌ల్ నోటీసులు పంపింది. త‌న అనుమ‌తి లేకుండా బ‌యోపిక్ తీయ‌కూడ‌దంటూ ఆమె పేర్కొన్నారు. ఇప్ప‌టికే వైల్డ్ వైల్డ్ కంట్రీ పేరుతో మా ఆనంద్ షీలా బ‌యోపిక్‌ను నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క‌థ‌తో సినిమా చేస్తాన‌ని చెప్పిన ప్రియాంక చోప్రాకు అభ్యంత‌రం చెప్పడం వెనుక‌.. మా ఆనంద్ షీలా యుక్త వ‌య‌సులో ఉన్న‌ప్పుడు అలియా భ‌ట్ ఉన్న‌ట్లే ఉండేద‌ని కాబ‌ట్టి ఆమె న‌టించాల‌ని ఆమె కోరుకుంటుంద‌ట‌.