close
Choose your channels

పరిటాల ఫ్యామిలీకి షాక్.. వైసీపీలోకి ముఖ్య అనుచరుడు!

Tuesday, January 29, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దివంగత నేత పరిటాల రవి ముఖ్య అనుచరులంతా ఒక్కొక్కరుగా ఆ ఫ్యామిలీకి దూరమవుతూ వస్తున్నారు.! అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం ముఖ్య నేతల వీక్‌నెస్‌‌పై కొడుతూ వారి ఫ్యామిలీ నుంచి, అనుచరులను పార్టీలోకి లాక్కునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి బావ వైసీపీలో చేరగా.. వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది గడికోట ద్వారకనాథరెడ్డి టీడీపీలో చేరారు. తాజాగా మంత్రి పరిటాల సునీత సునీత అనుచరుడు వేపకుంట రాజన్న టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

వేపకుంట రాజన్న.. పరిటాల రవి రాజకీయ అరంగేట్రం ఇవ్వకమునుపు ఉద్యమాలు నుంచి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రవి ఎక్కడికెళ్లినా రాజన్న వెంటుండేవారని ఆయన అభిమానులు చెప్పుకుంటూ వుంటారు. ఇంత పేరున్న రాజన్న సడన్‌‌గా టీడీపీని వీడాలనుకోవడం సునీతకు ఎదురుదెబ్బేనని రాప్తాడు ప్రజలు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ రాజన్న తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

అసలేం జరిగింది..!

"సునీత వైఖరి వల్లే నేను నాలుగేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్నాను. నిరుపేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే నాడు పరిటాల రవితో కలిసి భూస్వామ్య పోరాటాలు చేశాను. భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సునీత ఆయన ఆశయాలను పక్కనపెట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబ సభ్యులు, బంధువులకు తప్ప పేదలకు, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న మేలేమీ లేదు. ఇక సునీతతో వేగలేం. పార్టీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్నాను. పేదల పక్షాన పనిచేసే నాయకులు, పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాము" అని రాజన్న బహిరంగ సభలో చెప్పడం గమనార్హం.

కాగా త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పరిటాల రవి ముఖ్య అనుచరుడితో పాటు పలువురు స్థానిక నేతలు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాజన్న రాక గురించి తెలుసుకున్న రాప్తాడు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పార్టీలోకి ఎవరొచ్చినా తలుపులు ఎల్లప్పుడు తెరిచే ఉంటాయని ఆహ్వానించారు. కాగా గత ఎన్నికల్లో పరిటాల సునీత రాప్తాడు పోటీచేసి.. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తిపై 7,774 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. అయితే ఈసారి ఎలాగైనా సరే వైసీపీ జెండా పాతాలని ప్రకాశ్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్న సమయంలో పరిటాల ఫ్యామిలీకి అనుచరులు దూరమవ్వడం మరింత ప్లస్ అయ్యిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో ఈసారి రాప్తాడు వైసీపీదే అని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment