పరిటాల ఫ్యామిలీకి షాక్.. వైసీపీలోకి ముఖ్య అనుచరుడు!

  • IndiaGlitz, [Tuesday,January 29 2019]

దివంగత నేత పరిటాల రవి ముఖ్య అనుచరులంతా ఒక్కొక్కరుగా ఆ ఫ్యామిలీకి దూరమవుతూ వస్తున్నారు.! అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం ముఖ్య నేతల వీక్‌నెస్‌‌పై కొడుతూ వారి ఫ్యామిలీ నుంచి, అనుచరులను పార్టీలోకి లాక్కునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి బావ వైసీపీలో చేరగా.. వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది గడికోట ద్వారకనాథరెడ్డి టీడీపీలో చేరారు. తాజాగా మంత్రి పరిటాల సునీత సునీత అనుచరుడు వేపకుంట రాజన్న టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

వేపకుంట రాజన్న.. పరిటాల రవి రాజకీయ అరంగేట్రం ఇవ్వకమునుపు ఉద్యమాలు నుంచి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రవి ఎక్కడికెళ్లినా రాజన్న వెంటుండేవారని ఆయన అభిమానులు చెప్పుకుంటూ వుంటారు. ఇంత పేరున్న రాజన్న సడన్‌‌గా టీడీపీని వీడాలనుకోవడం సునీతకు ఎదురుదెబ్బేనని రాప్తాడు ప్రజలు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ రాజన్న తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

అసలేం జరిగింది..!

సునీత వైఖరి వల్లే నేను నాలుగేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్నాను. నిరుపేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే నాడు పరిటాల రవితో కలిసి భూస్వామ్య పోరాటాలు చేశాను. భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సునీత ఆయన ఆశయాలను పక్కనపెట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబ సభ్యులు, బంధువులకు తప్ప పేదలకు, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న మేలేమీ లేదు. ఇక సునీతతో వేగలేం. పార్టీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్నాను. పేదల పక్షాన పనిచేసే నాయకులు, పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాము అని రాజన్న బహిరంగ సభలో చెప్పడం గమనార్హం.

కాగా త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పరిటాల రవి ముఖ్య అనుచరుడితో పాటు పలువురు స్థానిక నేతలు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాజన్న రాక గురించి తెలుసుకున్న రాప్తాడు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పార్టీలోకి ఎవరొచ్చినా తలుపులు ఎల్లప్పుడు తెరిచే ఉంటాయని ఆహ్వానించారు. కాగా గత ఎన్నికల్లో పరిటాల సునీత రాప్తాడు పోటీచేసి.. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తిపై 7,774 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. అయితే ఈసారి ఎలాగైనా సరే వైసీపీ జెండా పాతాలని ప్రకాశ్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్న సమయంలో పరిటాల ఫ్యామిలీకి అనుచరులు దూరమవ్వడం మరింత ప్లస్ అయ్యిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో ఈసారి రాప్తాడు వైసీపీదే అని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

More News

ఫిబ్రవరి 14 న విడుదల కానున్న 'దేవ్'

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'దేవ్' చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది.  సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న విడుదలైన

అవును.. చంద్రబాబు దొంగతనం చేశారు!

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు గత కొద్దిరోజులుగా యూట్యూబ్‌‌లో ఓ రేంజ్‌లో హల్ చల్ చేస్తున్నారు.

పవన్ ఆహ్వానం మన్నించి ఆయన జనసేనలోకి వస్తారా!?

ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పెంటపాటి పుల్లరావు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.

తెలుగులో శివ‌కార్తికేయ‌న్ 'సీమ‌రాజ'

రొమియో లాంటి ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ లో అద్బుతంగా నటించి తెలుగు ప్రేక్ష‌కులంద‌రి ప్ర‌శంశలు పొందిన శివకార్తికేయ‌న్ హీరోగా, స‌మంత, కీర్తిసురేష్ లు హీరోయిన్స్ గా

ముంబై కి తేజు

ఇంత‌కు ముంబైకి తేజు ఎందుకు వెళ్తున్నాడ‌నుకుంటున్నారా? త‌ను హీరోగా న‌టిస్తున్న 'చిత్ర‌ల‌హ‌రి' సినిమా కోసం. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌ఫై సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల