కమల్‌కు షాక్.. అవినీతి ఆరోపణలతో అడ్డంగా బుక్కైన పార్టీ కార్యదర్శి
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో పొలిటికల్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కమల్ హాసన్.. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ పార్టీ అవినీతికి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలని యత్నిస్తోంది. కాగా.. తాజాగా మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్‌పై పలు అవినీతి ఆరోపణలతో ఐటీకి అడ్డంగా దొరికిపోయారు.
కరోనా కాలంలో ప్రభుత్వం మాస్క్‌లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్‌కు చెందిన అనితా టెక్స్‌కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థపై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ.80కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో ఈ పార్టీ జనాల్లోకి వెళుతున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అది కూడా పార్టీ కార్యదర్శే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments