కమల్‌కు షాక్.. అవినీతి ఆరోపణలతో అడ్డంగా బుక్కైన పార్టీ కార్యదర్శి

  • IndiaGlitz, [Saturday,March 20 2021]

తమిళనాడులో పొలిటికల్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కమల్ హాసన్.. మక్కల్‌ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ పార్టీ అవినీతికి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలని యత్నిస్తోంది. కాగా.. తాజాగా మక్కల్‌ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్‌పై పలు అవినీతి ఆరోపణలతో ఐటీకి అడ్డంగా దొరికిపోయారు.

కరోనా కాలంలో ప్రభుత్వం మాస్క్‌లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్‌కు చెందిన అనితా టెక్స్‌కార్ట్‌ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థపై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ.80కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో ఈ పార్టీ జనాల్లోకి వెళుతున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అది కూడా పార్టీ కార్యదర్శే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

More News

నా దగ్గర 8.55 కిలోల బంగారం ఉంది: ఖుష్బూ

తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రముఖ సినీ నటి ఖుష్బూ థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

‘జాతిరత్నాలు’ అదరగొడుతున్న స్పెషల్ సాంగ్...

చాలా కాలం తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి కడుపుబ్బ నవ్వుకున్నారంటే దానికి కారణం ‘జాతిరత్నాలు’.

సందడిగా ‘రంగ్‌దే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నితిన్‌కు అభిమాని ఆసక్తికర ప్రశ్న..

అశేష అభిమానుల మ‌ధ్య క‌ర్నూలులో గ్రాండ్‌గా 'రంగ్ దే' ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ జరిగింది. ఆద్యంతం న‌వ్వుల‌తో ఈ ట్రైలర్ అల‌రించింది.

'చావు కబురు చల్లగా'కు ఝలక్ ఇచ్చిన పోలీసులు

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ పెగ‌ళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ర‌వితేజ‌ 'ఖిలాడి'

'క్రాక్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, 'రాక్ష‌సుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో