మందు బాబులకు షాక్.. కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే

  • IndiaGlitz, [Saturday,December 12 2020]

కరోనా మహమ్మారిని నివారించడంలో భాగంగా ఇప్పడిప్పుడే ఒక్కొక్కటిగా వ్యాక్సిన్లు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు అన్ని వ్యాక్సిన్‌లకు సంబంధించిన ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్‌లు మందు బాబులకు మాత్రం షాకిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండు నెలల వరకూ మందు ముట్టకూడదట. ఈ విషయాన్ని రష్యాకు చెందిన అధికారులు స్వయంగా వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోడంలో భాగంగా పలు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని వెల్లడించారు.

రష్యాకు చెందిన అధికారులు మాత్రం తమ దేశ పౌరులకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు నెలల పాటు మద్యానికి పూర్తిగా దూరంగా హెచ్చరిస్తున్నారు. ఈ వార్త అత్యధికంగా మద్యం తాగే దేశాలకు మింగుడు పడని వార్తేనని అధికారులు చెబుతున్నారు. భారత్ వంటి దేశాలకు ఇది చాలా కష్టం. లాక్‌డౌన్ సమయంలో పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలను మూసివేస్తేనే ఏమాత్రం నియంత్రణ పాటించేందుకు ఇష్టపడలేదు. శానిటైజర్ తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది ఇప్పుడు ఎదురుగా మద్యం దుకాణాలు కనిపిస్తుంటే ఎంత మేరకు నియంత్రించుకుంటారో వేచి చూడాలి.

కాగా.. ఈ వ్యాక్సిన్‌ను తొలిదశలో కరోనా వారియర్స్‌కు ఇవ్వనున్నారు. ఆ తర్వాత దఫదఫాలుగా వివిధ ఏజ్ గ్రూప్‌ల వారికి ఇవ్వనున్నారు. అయితే స్పుత్నిక్ వి కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రభావవంతం కావడానికి 42 రోజుల్లో రష్యన్లు అదనపు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని రష్యా ఉప ప్రధాని టటియానా గోలికోవా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొత్తానికి వ్యాక్సిన్ వచ్చేస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకుని కొన్ని జాగ్రత్తలను పాటిస్తే మహమ్మారి నుంచి విముక్తి పొందవచ్చు.

More News

ప్రధానితో ప్రభాస్‌కు లింకేంటి?

'బాహుబలి'తో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన రెబల్‌స్టార్ ప్రభాస్‌ సాహో తర్వాత చేస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'రాధేశ్యామ్‌'. పీరియాడిక్‌ లవ్‌స్టోరిగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ జోడీగా

ఎట్టకేలకు ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

మూడు నెలల సుదీర్ఘ విరామానంతరం ఎట్టేకేలకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.

స్టార్ డైరెక్ట‌ర్స్‌కి షాకిచ్చిన విజ‌య్‌..!

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ ఇప్పుడిప్పుడే త‌న సినిమాల‌కు తెలుగులో మార్కెట్‌ను క్రియేట్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు.

రాజకీయంగా చర్చనీయాంశంగా.. అమిత్ షాతో కేసీఆర్ భేటీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రోసారి వ్యాఖ్యాత‌గా ఎన్టీఆర్

సీనియ‌ర్ అగ్ర హీరోల్లో చిరంజీవి, నాగార్జున వెండితెర‌పైనే కాదు.. బుల్లితెర‌పై కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే.