దిల్ రాజుకు షాక్.. వకీల్ సాబ్ డైరెక్టర్ ఏం చేయబోతున్నాడు ?

దిల్ రాజు ఆస్థాన దర్శకులలో వేణు శ్రీరామ్ ఒకరు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో వచ్చిన ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ, వకీల్ సాబ్ మూడు చిత్రాలు దిల్ రాజు నిర్మాణంలోనే రూపొందాయి. వీటిలో ఓ మై ఫ్రెండ్ చిత్రం నిరాశపరిచింది. ఎంసీఏ, రీసెంట్ గా వచ్చిన వకీల్ సాబ్ మంచి విజయాలుగా నిలిచాయి. రీమేక్ సబ్జెక్ట్ అయినప్పటికీ పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా వకీల్ సాబ్ తెరకెక్కించిన విధానానికి వేణు శ్రీరామ్ ప్రశంసలు అందుకున్నాడు.

Also Read: మే 21న 'జీ 5' ఒరిజినల్ సిరీస్, తరుణ్ భాస్కర్ సమర్పించు 'రూమ్ నంబర్ 54' రిలీజ్!

వకీల్ సాబ్ సూపర్ హిట్ అయిన సంతోషంలో వేణు శ్రీరామ్ తదుపరి చిత్రం 'ఐకాన్' తన బ్యానర్ లోనే ఉంటుందని దిల్ రాజు ప్రకటించేశాడు కూడా. కానీ తాజా పరిణామాలు అలా కనిపించడం లేదు. చాలా కాలం క్రితమే ఐకాన్ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఇన్నాళ్లకు మోక్షం వచ్చింది అనుకుంటున్న తరుణంలో మరోసారి అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

కొన్ని కారణావల్ల అసంతృప్తి చెందిన వేణు శ్రీరామ్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసినట్లు టాక్. అంతేకాదు ఓ స్టార్ హీరోని కలసి కథ వినిపించి ఇంప్రెస్ చేశాడట. ఈ చిత్రం కోసం వేణు శ్రీరామ్ వేరే నిర్మాతలతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. తనకు బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు కూడా వేణు శ్రీరామ్ ఇటీవల తెలిపారు.

దిల్ రాజు విషయంలో వేణు శ్రీరామ్ ఎందుకు అసంతృప్తి చెందాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎంసీఏ తర్వాత ఐకాన్ తెరకెక్కించాలనుకున్న వేణుకి నిరాశే ఎదురైంది. దీనితో సరైన సమయంలో వేణుకి వకీల్ సాబ్ రూపంలో మంచి అవకాశం వచ్చింది. అందరిని సర్ ప్రైజ్ చేస్తూ తన టేకింగ్ తో అదరగొట్టేశాడు. పింక్ లాంటి కథని ఇలా కూడా తీయొచ్చా అని అందరూ ముక్కున వేలేసుకుని విధంగా వేణు శ్రీరామ్ చేశాడు.

More News

మే 21న 'జీ 5' ఒరిజినల్ సిరీస్, తరుణ్ భాస్కర్ సమర్పించు 'రూమ్ నంబర్ 54' రిలీజ్!

విలక్షణ కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలు...

తెలంగాణలో ప్రైవేటు అస్పత్రుల దోపిడీపై హైకోర్టు సీరియస్

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో నేడు మరోసారి సుదీర్ఘ విచారణ జరిగింది.

సాయి పల్లవికి రూ. 5 కోట్ల లాస్.. ఎలా జరిగిందంటే?

ప్రేమమ్ చిత్రంతో సాయి పల్లవి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో మాత్రం ఫిదా చిత్రంతో అడుగుపెట్టింది.

కర్ఫ్యూ, బ్లాక్ ఫంగస్‌ చికిత్స విషయంలో జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్‌ కారణంగా ఏపీలో పలువురు మరణిస్తున్నారు.

బిల్‌గేట్స్ దంపతులు విడిపోవడానికి ఆ మహిళే కారణమట..

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ విడాకుల వ్యవహారానికి సంబంధించి రోజుకో వార్త వెలుగు చూస్తోంది.