ఢిల్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీకి ఊహించని షాక్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్‌కు ఆప్ ఊహించని షాకిచ్చింది. ఎలాగైనా సరే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్న ‘ఆప్’.. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులను సైతం ప్రోత్సహిస్తూ ముందుకెళ్తోంది. గత రెండు మూడ్రోజులుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఆప్‌దే మరోసారి అధికారమని ముందే ఊహించారో ఏమోగానీ.. కాంగ్రెస్, బీజేపీ నేతలు ‘చీపురు’ వైపు చూపు చూస్తున్నారు. కేజ్రీవాల్ సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌మిశ్రా, రాంసింగ్ ఆప్‌లో చేరారు. ఢిల్లీ ఎన్నికల్లో చీపురు హవా ఉంటుందని పార్టీ మారిన నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. ఇవాళ సీఏఏ, ఎన్‌ఆర్సీలపై చర్చించేందుకు హస్తినలో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి హాజరు కావట్లేదని ఆప్ ప్రకటించింది. ఇవాళ జరిగిన చేరికల పరిణామాలు చర్చకొచ్చే అవకాశం ఉందనే ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ హాజరు కాలేదని తెలుస్తోంది.
కాగా.. ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ... మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తుండగా... బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. గతంలో షీలాదీక్షిత్ లాంటి బలమైన నేత ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉండగా.. మరోసారి ఢిల్లీపై పట్టుసాధించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. దీంతో... ఢిల్లీలో త్రిముఖపోరు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఢిల్లీ పీఠం ఎవరిదో..? ఎవరు దానిపై కూర్చుంటారో..? అనేది ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు వస్తే తేలిపోతుంది.
ఎన్నికలు ఇలా..!
జనవరి 14 నోటిఫికేషన్
నామినేషన్ల దాఖలకు చివరి తేదీ జనవరి 21
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 24
ఫిబ్రవరి 8వ తేదీన పోలింగ్
ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు.
మొత్తం అసెంబ్లీ స్థానాలు : 70
మొత్తం ఓటర్లు : 1.46 కోట్ల మంది
పోలింగ్ కేంద్రాలు : 13, 750
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout