MP Pothuganti Ramulu: బీఆర్ఎస్‌ పార్టీకి ఊహించని షాక్.. బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు

  • IndiaGlitz, [Wednesday,February 28 2024]

బీఆర్‌ఎస్ పార్టీ మరో భారీ షాక్ తగిలింది. నాగర్‌కర్నూల్‌ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు(MP Ramulu) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. బీఆర్‌ఎస్‌లో ఇటీవల ఎదురైన పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన కమలం కండువా కప్పుకోనున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకుని బీజేపీ.. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లలో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకు తగ్గట్లే కీలకమైన నేతలను పార్టీలో చేర్చుకుంటుంది.

కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల పట్ల రాములు అసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో జరిగే పార్టీ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కుమారుడు భరత్‌ను ఎంపీగా పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నారు. కానీ పార్టీ పెద్దల నుంచి సుముఖత రాకపోవడంతో ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమారుడి రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

వాస్తవంగా ఆయన అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాలని తొలుత భావించారు. కానీ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్‌ను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆశిస్తున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఆయన ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీగా రాములు కుమారుడు భరత్ బరిలో దిగనున్నారు.

మరోవైపు సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్‌ నేతకాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే రంగారెడ్డి జిల్లా సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా హస్తం కండువా కప్పుకున్నారు. చేవెళ్ల ఎంపీగా సునీతారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి వంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

More News

Hanuma Vihari: హనుమ విహారి వ్యవహారశైలి తొలి నుంచి వివాదస్పదమే.. ఏసీఏ ప్రకటన..

టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో పచ్చ నేతలు, పచ్చ మీడియా విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తమకు అనుకూలంగా వార్తలను వండి వార్చుతూ ప్రజలను మభ్య పెడుతున్నారు.

Revanth Reddy: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌.. బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..?

మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కూడా 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో..

MP Magunta: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా..

ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి (Magunta Sreenivasulu Reddy)

ప్రయాణికులకు శుభవార్త.. రైల్వే ఛార్జీలు తగ్గింపు..

ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) శుభవార్త అందించింది. ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌గా మారిన ప్యాసింజర్‌ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

CM Revanth Reddy: ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద