మోదీ పేరు చెప్పగానే పాక్ మంత్రికి కరెంట్ షాక్!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పగానే పాక్ మంత్రికి సడన్‌గా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఉలిక్కిపడ్డ ఆయన.. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కొన్ని నిమిషాలు సమయం పట్టింది. అనంతరం మళ్లీ యథావిథిగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మళ్లీ మోదీపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ పాక్ మంత్రికి కరెంట్ షాక్ ఎలా కొట్టింది...? అసలు మోదీని ఆయన ఏమన్నారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇది ఒకింత కశ్మీరులకు మాత్రమే కాదు యావత్ భారతదేశానికి మంచి శుభపరిణామమని భావిస్తుండగా పాక్ మాత్రం తమ పైత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అస్తమాను మీడియా ముందుకొచ్చి ఇష్టానుసారం మాట్లాడటం.. ఆఖరికి యుద్ధం అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సభలో ప్రసంగిస్తుండగా ఓ విచిత్ర ఘటన జరిగింది. సభలో మోదీ గురించి మాట్లాడుతుండగా.. విద్యుత్ షాక్ తగిలింది. షాక్ కొట్టిన క్షణంలో ఆయన ఒక్కసారిగా వేదికపై తుళ్లిపడిపోయారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఇండియన్స్ నవ్వుకుంటుండగా.. పాక్ మాత్రం తీవ్రస్థాయిలో కామెంట్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే.. షాక్ నుంచి తేరుకున్న అనంతరం పాక్ మంత్రి మళ్లీ సభలో మాట్లాడుతూ.. తనకు విద్యుత్ వల్లే షాక్ తగిలిందని.. ఈ సమావేశాన్ని మోదీ విఫలం చేయలేరంటూ రషీద్ వ్యాఖ్యానించి నవ్వులపాలయ్యారు.
కాగా.. సెప్టెంబరు లేదా అక్టోబరులో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగొచ్చని.. ఈ యుద్ధమే చివరి యుద్ధమవుతుందని రైల్వే మంత్రి జోస్యం చెప్పి అటు పాక్‌లో ఇటు ఇండియాలో ఆయన హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments