Chandrababu, Lokesh:చంద్రబాబు, లోకేష్‌కు షాక్.. వ్యక్తిగత దాడి అని తేల్చిన పోలీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, తాడిపత్రి, తిరుపతి, మరికొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు కత్తులు, రాడ్లుతో దాడులు చేశారు. ఈ దాడుల్లో చాలా మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు ఇలా గొడవలు జరుగుతుండగానే.. మరోవైపు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. తాజాగా విశాఖలో జరిగిన ఓ ఘటనను వైసీపీ కార్యకర్తలపైకి నెట్టేశారు లోకేష్, చంద్రబాబు. దీంతో ఈ గొడవ రాజకీయ రంగు పులుముకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఈ ప్రచారం ఫేక్ అని తేల్చారు. ఇది రాజీకయ దాడి కాదంటూ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు.
ఈ గొడవపై విచారణ చేపట్టిన పోలీసులు దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇరు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో రాజకీయ ప్రమేయం లేదని కమిషనర్ తేల్చిచెప్పారు. కంచరపాలెం పరిధిలో మహిళలపై జరిగిన దాడికి వ్యక్తిగత గొడవలే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనను ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక బర్మా క్యాంప్ నూకాలమ్మ ఆలయ సమీపంలో సుంకరి ఆనందరావు, భార్య ధనలక్ష్మి, కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠతో కలిసి ఉంటున్నారని తెలిపారు. ఆమె ఇంటికి సమీపంలో లోకేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో ఉంటున్నారని ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య దాడి జరిగిందని. ఈ దాడిలో నూకరత్నం, ఆమె కుమార్తె, మరో యువకునికి గాయాలయ్యాయన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామని.. లోకేష్‌ను రిమాండ్‌కు తరలించారని వివరించారు.
కాగా పోలింగ్ రోజు విశాఖపట్నంలోని అక్కిరెడ్డిపాలెంలో ఓ గొడవ జరిగింది. వైసీపీకి ఓటు వేయలేదని ఓ కుటుంబంపై దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బాధితులు కూడా తమపై పొలిటికల్ అటాక్ జరిగిందని ఆరోపించారు. దీంతో నారా లోకేష్, చంద్రబాబు కూడా ఇది పొలిటికల్ దాడి అని వైసీపీని విమర్శిస్తూ పోస్టింగ్ పెట్టారు. ప్రజాస్వామ్యంపై వైసీపీ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. అమానవీయ ఘటన, అనాగరిక చర్య అంటూ దుమ్మెత్తిపోశారు. దీంతో టీడీపీ సానుభూతిపరులంతా సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. దీంతో ఈ ప్రచారాన్నిపోలీసులు ఖండించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments