AP Govt:ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. విశాఖ నుంచి పరిపాలన లేనట్లే..

  • IndiaGlitz, [Friday,December 22 2023]

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కుదురైంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు న్యాయస్థానం బ్రేక్ వేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే యత్నాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంతవరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది.

మంగళవారం జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాదులు సుమన్‌, మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని కోరారు. సీఎం క్యాంపు కార్యాలయం వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ విచారణ ఆ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉందని.. అందువల్ల ప్రస్తుత వ్యాజ్యాలను కూడా త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని విజ్ఞప్తి చేశారు.

ఇక బుధవారం జరిగిన విచారణలో హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారని పిటిషనర్ తరపు లాయర్లు వాదించారు. ఫర్నిచర్‌ సైతం కొనుగోలు చేశారని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ బదిలీ చేస్తున్నట్లు ఆదేశించారు. అలాగే త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్‌ కో జారీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలని భావించిన ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది.

ఎందుకంటే మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయని.. త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా జనవరి నెలాఖరు లోపు తీర్పు వచ్చినా.. ఎన్నికల సమయం కాబట్టి విశాఖకు తరలింపు ఉండపోవచ్చు. మొత్తానికి వైజాగ్ నుంచి పరిపాలన చేయాలనుకున్న సీఎం జగన్ ఆశలు ఆడియాశలయ్యాయి.

More News

YS Jagan Birthday: వరల్డ్ టాప్ ట్రెండింగ్‌లో సీఎం జగన్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజును పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. వారం రోజుల ముందే అభిమానులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు చేయడం మొదలుపెట్టారు.

Akbaruddin vs Revanth: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ మధ్య పవర్ వార్

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ రంగంపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..

CM Jagan:మంచి చేస్తుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు ఏడుస్తున్నారు: సీఎం జగన్

ప్రజలకు మంచి చేస్తున్న తనపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌(Pawankalyan) దిగజారి మాట్లాడుతున్నారని సీఎం జగన్(CM

Kodali Nani: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లోకేశ్‌పై కొడాలి నాని హాట్ కామెంట్స్

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు.

CM Jagan:సీఎం జగన్ పుట్టినరోజ సందర్భంగా వాలంటీర్లకు జీతం పెంపు

సీఎం జగన్ పుట్టినరోజ సందర్భంగా వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ,