‘మేజ‌ర్’ సినిమాలో శోభితా ధూళిపాల

  • IndiaGlitz, [Monday,March 02 2020]

26/11..పాకిస్థాన్ ముష్క‌రులు ముంబైలోని తాజ్ హోట్‌లోపై దాడి జ‌రిపిన రోజుది. చాలా మంది ప్రాణాల‌ను కోల్పోయారు. భారత సైన్యం ప్రాణాలకు తెగించి ముష్కరులను మట్టుబెట్టింది. ఈ దాడిలో ఎన్ఎస్‌జీ కమెండో సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌న ప్రాణాల‌ను త్యాగం చేసి ఉగ్ర‌వాదుల చెర‌లోని శ‌ర‌ణార్ధుల ప్రాణాల‌ను కాపాడారు. ఈ రియ‌ల్ హీరో చేసిన సాహసాన్ని, ప్రాణ త్యాగాన్ని మేజ‌ర్ సినిమాగా చిత్రీక‌రిస్తున్నారు. ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌లో అడ‌విశేష్ న‌టిస్తున్నారు. గూఢ‌చారి స‌క్సెస్ త‌ర్వాత శేష్ న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

హిందీ, తెలుగు భాష‌ల్లో గూఢ‌చారి ఫేమ్‌ శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మ‌హేశ్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చ‌ర్స్‌, ఎప్ల‌స్ఎస్ మూవీస్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతుంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో శోభితా దూళిపాల ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆమె పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా, ఎమోష‌న‌ల్‌గా ఆక‌ట్టుకోనుందని ఆమె పాత్ర గురించి శేష్ ట్వీట్ చేశారు. గూఢ‌చారి త‌ర్వాత శేష్‌తో దూళిపాల క‌లిసి న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది.

More News

ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో సూర్య 39...

హీరో సూర్య త‌న 38వ చిత్రం శూర‌రై పోట్రుని ఈ ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్' ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఆడియో ఆల్బమ్

కొరటాలకు షాకిచ్చిన చిరంజీవి!!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి 152వ చిత్ర‌మిది.

'RRR' ఫుల్ ఫామ్ ఇదేనట.. త్వరలో అధికారిక ప్రకటన!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా

చిరు, అలీ ఇద్దరూ కాదు.. అంబానీకి మాటిచ్చేసిన జగన్!

టైటిల్ చూడగానే ఇదేంటబ్బా తలా తోకా లేకుండా ఉంది.. అసలు మెగాస్టార్ చిరంజీవికి.. అలీకి సంబంధమేంటి..? వారిద్దరి మధ్యలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి