Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ నుంచి శోభాశెట్టి ఎలిమినేషన్.. శివాజీ కాళ్ల మీద పడి క్షమాపణలు , ఫైనలిస్టులు వీళ్లే

  • IndiaGlitz, [Monday,December 11 2023]

అనుకున్నట్లుగానే బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ నుంచి శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యింది. హౌస్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా వున్న శోభాశెట్టి ఖచ్చితంగా గ్రాండ్ ఫినాలేకు వెళ్తారని అంతా భావించారు. కానీ చివరి వారానికి ముందే ఆమె హౌస్‌ను వీడారు. ఇక ఆదివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఆట , పాటలతో సందడి చేయించారు. ఆస్కార్ అవార్డ్ విజేత, లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి .. బిగ్‌బాస్ వేదిక మీదకు వచ్చారు. నాగార్జున హీరోగా నటిస్తున్న ‘‘ నా సామిరంగ’’ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని బిగ్‌బాస్ వేదికపై లాంచ్ చేశారు. అనంతరం కంటెస్టెంట్స్‌ని కీరవాణికి పరిచయం చేశారు నాగ్.

తర్వాత ఈ 14 వారాల్లో ఏం వారం జరిగిన సంఘటన పట్ల పశ్చాత్తాపం చెందుతారు అని టాస్క్ ఇచ్చాడు నాగ్.. దీనికి ప్రియాంక.. 7వ వారంలో భోలేని ఓ మాట అనకుండా వుండాల్సిందని చెప్పింది. అలాగే 9వ వారం యావర్‌ని మెంటల్ అనకుండా వుండాల్సిందని శోభాశెట్టి పేర్కొంది. అమర్‌దీప్ 14వ వారం తను ఎందుకలా పిచ్చోడిలా ప్రవర్తించానో అర్ధం కావడం లేదని రియలైజ్ అయ్యాడు. 14వ వారం ఆడపిల్లలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు శివాజీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

అలాగే ఏ కంటెస్టెంట్ నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పాలని మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ప్రశాంత్ దగ్గర గేమ్ ఆడటం, అర్జున్ దగ్గర నిజాయితీ నేర్చుకున్నానని అమర్‌దీప్ తెలిపాడు. శివాజీ దగ్గర ఓపికగా వుండటం నేర్చుకున్నానని ప్రిన్స్ యావర్ వెల్లడించారు. అమర్‌దీప్‌కు చురకలంటించేలా అతనిలా ఫౌల్ గేమ్స్ ఆడొద్దని నేర్చుకున్నానని ప్రియాంక తెలిపింది. శివాజీ దగ్గర లౌక్యం, యావర్ నుంచి పట్టుదల, ప్రశాంత్ నుంచి కలుపుగోలు , ప్రియాంక నుంచి నవ్వుతూ మాట్లాడటం నేర్చుకున్నానని అర్జున్ అన్నాడు. శోభా మాత్రం కాస్త డిఫరెంట్‌గా తాను ఎవ్వరి నుంచి ఏం నేర్చుకోలేదని, ఫోన్ లేకుండా బతకడం నేర్చుకున్నానని చెప్పింది.

అందరూ హ్యాపీ మూడ్‌లో వుండగా నాగార్జున షాకిచ్చారు. ఈ వారం సేవింగ్ , ఎలిమినేషన్ లాంటిది ఏం లేకుండా ఎవరెవరు ఫైనల్‌లో అడుగుపెడుతున్నారో ప్రకటించాడు. ప్రియాంక, యావర్, ప్రశాంత్, అమర్‌దీప్‌లు ఫినాలే వీక్‌లో అడుగుపెట్టినట్లు చెప్పాడు. అయితే శివాజీ, శోభాశెట్టిలు మిగలగా.. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని, మరొకరు ఫైనలిస్టుగా నిలుస్తారని నాగ్ చెప్పాడు. ఇద్దరికి ఓ గేమ్ పెట్టగా ఇందులో శివాజీ విజయం సాధించగా.. శోభాశెట్టి ఎలిమినేట్ అయినట్లుగా నాగ్ ప్రకటించారు. దీంతో ప్రియాంక కన్నీటి పర్యంతమైంది.

శివాజీ కాళ్ల మీద పడి.. అన్నా ఏమైనా తప్పు చేసుంటే క్షమించండి, ఎమోషన్స్ వల్ల ఏదైనా మాట్లాడి వుంటానని, కావాలని కాదంటూ సారీ చెప్పింది. శివాజీ కూడా అలాంటిదేం లేదని చెప్పాడు. యావర్ కూడా గత వారం జరిగిన గొడవపై సారీ చెప్పాడు. అర్జున్‌కు వెళ్తూ వెళ్లూ ధైర్యం చెప్పిన శోభా.. తన ఓట్లన్నీ నీకే అని భరోసా కల్పించింది. అమర్‌దీప్ కప్పుకొట్టి అనంతపురం రావాలని ఆకాంక్షించింది. యావర్ గత కొన్నివారాల్లో మారాడని చెప్పింది. బిగ్‌బాస్ వేదికపై శోభాశెట్టి తన జర్నీ చూసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో నాగార్జున ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. అనంతరం అందరికీ వీడ్కోలు చెప్పిన శోభ .. బిగ్‌బాస్ వేదికను వీడింది.

More News

Balineni:మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను.. బాలినేని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నీతిమంతుడినని చెప్పడం లేదని..

Ram Charan : రామ్‌ చరణ్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం .. ‘పాప్ గోల్డెన్ అవార్డ్’ అందుకున్న మెగా హీరో

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్.

CM Revanth Reddy:మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana Congress: కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుల భారం.. గ్యారంటీలు నెరవేర్చడం సాధ్యమేనా..?

తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లింది.

YS Jagan: మడమ నొప్పిగా ఉన్నా.. వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్

మిజాంగ్ తుఫాన్ హెచ్చరికలతో సీఎం జగన్ వెంటనే అప్రమత్తమై అధికారులను అలర్ట్ చేయడంతో స్వల్ప నష్టంతో ప్రజలు బయటపడ్డారు. కానీ వరద బాధితులను నేరుగా పరామర్శించలేకపోతున్నానని