Bigg Boss Telugu 7: మరోసారి టార్గెట్ అయిన భోలే.. పెద్దన్నయ్యలా శివాజీ, హీటెక్కించిన నామినేషన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం పూజా మూర్తి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో వరుసగా ఏడుగురు అమ్మాయిలు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే సోమవారం నామినేషన్ల కార్యక్రమం ఉత్కంఠగా జరిగింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్స్ హీటు కొనసాగింది. హౌస్‌లో వుండేందుకు అనర్హులని భావించే ఇద్దరి ఫోటోలను మంటల్లో వేసి కాల్చివేయాలి. ఈ వారం సందీప్, శివాజీ , భోలే షావళి, అమర్‌దీప్, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్ నామినేషన్‌లో వున్నట్లుగా తెలుస్తోంది.
నామినేషన్స్ సందర్భంగా శివాజీ, శోభా శెట్టిల మధ్య వాగ్వాదం జరిగింది. భోలే మాట్లాడింది 100 శాతం తప్పేనని, కానీ వెంటనే క్షమాపణలు కోరాడని , క్షమిస్తే ఏమవుతుందని శోవాజీ ప్రశ్నించాడు. దీనికి శోభ వెటకారంగా సమాధానం చెప్పింది. దేవుడు మీకు క్షమించే మనసు ఇచ్చాడు. తనకు క్షమించే మనసు ఇవ్వలేదు అని చెప్పింది. అయితే నిన్ను మారమని ఒత్తిడి చేసే రైట్ నాకు లేదంటూ శోభ ఫోటోను మంటల్లో వేశాడు శివాజీ. దీనికి శోభ ఫైర్ అయ్యింది. కామన్‌సెన్స్ లేకుండా నామినేషన్స్ చేస్తారంటూ కామెంట్ చేసింది.
ఇక బిగ్‌బాస్‌లో ప్రియాంక, భోలేల మధ్య గత వారం చోటు చేసుకున్న వార్ ఈ వీక్ కూడా కంటిన్యూ అయ్యింది. కెప్టెన్సీ అనేది అరుదుగా దొరికే అవకాశమని, మీరు దానిని సులభంగా వదిలేసుకున్నారంటూ ప్రియాంక వాదించింది. దీనికి భోలే అలాగే బదులిచ్చాడు. మీకు ఈ జన్మలో పాజిటివ్‌గా వుండటం రాదంటూ కామెంట్ చేశాడు. అయితే గడిచిన 8 వారాలుగా అసలు నామినేషన్స్ దరిదాపుల్లోకి కూడా రాని సందీప్‌నే తేజ నామినేట్ చేయాలనుకున్నాడు. ఆయనను ఎవరూ నామినేట్ చేయడం లేదని, ఒకసారి నామినేట్ చేస్తే నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయితే కాన్ఫిడెన్స్ పెరుగుతుందని తేజ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు.. భోలేను ఎక్కువ మంది నామినేట్ చేయడంతో ఆయన హర్ట్ అయ్యాడు. శివాజీతో మాట్లాడుతూ.. ఈసారి వెళ్లిపోతానేమోనని బాధపడ్డాడు. దీనిపై స్పందించిన శివాజీ.. అతనిలో ధైర్యం నింపేలా మాట్లాడాడు. నిన్ను నేను లేపుతా, ఆడిస్తా, పాడిస్తా.. సామాన్యుల కోసమే నేను ఇక్కడ వున్నానని పేర్కొన్నాడు. జనానికి ఇది కాస్త ఓవర్ అనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్స్ హీట్ మంగళవారం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com