Bigg Boss Telugu 7: మరోసారి టార్గెట్ అయిన భోలే.. పెద్దన్నయ్యలా శివాజీ, హీటెక్కించిన నామినేషన్స్

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

బిగ్‌బాస్ 7 తెలుగు విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం పూజా మూర్తి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో వరుసగా ఏడుగురు అమ్మాయిలు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే సోమవారం నామినేషన్ల కార్యక్రమం ఉత్కంఠగా జరిగింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్స్ హీటు కొనసాగింది. హౌస్‌లో వుండేందుకు అనర్హులని భావించే ఇద్దరి ఫోటోలను మంటల్లో వేసి కాల్చివేయాలి. ఈ వారం సందీప్, శివాజీ , భోలే షావళి, అమర్‌దీప్, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్ నామినేషన్‌లో వున్నట్లుగా తెలుస్తోంది.

నామినేషన్స్ సందర్భంగా శివాజీ, శోభా శెట్టిల మధ్య వాగ్వాదం జరిగింది. భోలే మాట్లాడింది 100 శాతం తప్పేనని, కానీ వెంటనే క్షమాపణలు కోరాడని , క్షమిస్తే ఏమవుతుందని శోవాజీ ప్రశ్నించాడు. దీనికి శోభ వెటకారంగా సమాధానం చెప్పింది. దేవుడు మీకు క్షమించే మనసు ఇచ్చాడు. తనకు క్షమించే మనసు ఇవ్వలేదు అని చెప్పింది. అయితే నిన్ను మారమని ఒత్తిడి చేసే రైట్ నాకు లేదంటూ శోభ ఫోటోను మంటల్లో వేశాడు శివాజీ. దీనికి శోభ ఫైర్ అయ్యింది. కామన్‌సెన్స్ లేకుండా నామినేషన్స్ చేస్తారంటూ కామెంట్ చేసింది.

ఇక బిగ్‌బాస్‌లో ప్రియాంక, భోలేల మధ్య గత వారం చోటు చేసుకున్న వార్ ఈ వీక్ కూడా కంటిన్యూ అయ్యింది. కెప్టెన్సీ అనేది అరుదుగా దొరికే అవకాశమని, మీరు దానిని సులభంగా వదిలేసుకున్నారంటూ ప్రియాంక వాదించింది. దీనికి భోలే అలాగే బదులిచ్చాడు. మీకు ఈ జన్మలో పాజిటివ్‌గా వుండటం రాదంటూ కామెంట్ చేశాడు. అయితే గడిచిన 8 వారాలుగా అసలు నామినేషన్స్ దరిదాపుల్లోకి కూడా రాని సందీప్‌నే తేజ నామినేట్ చేయాలనుకున్నాడు. ఆయనను ఎవరూ నామినేట్ చేయడం లేదని, ఒకసారి నామినేట్ చేస్తే నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయితే కాన్ఫిడెన్స్ పెరుగుతుందని తేజ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు.. భోలేను ఎక్కువ మంది నామినేట్ చేయడంతో ఆయన హర్ట్ అయ్యాడు. శివాజీతో మాట్లాడుతూ.. ఈసారి వెళ్లిపోతానేమోనని బాధపడ్డాడు. దీనిపై స్పందించిన శివాజీ.. అతనిలో ధైర్యం నింపేలా మాట్లాడాడు. నిన్ను నేను లేపుతా, ఆడిస్తా, పాడిస్తా.. సామాన్యుల కోసమే నేను ఇక్కడ వున్నానని పేర్కొన్నాడు. జనానికి ఇది కాస్త ఓవర్ అనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్స్ హీట్ మంగళవారం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ వుంది.

More News

Pawan Kalyan: ఏపీకి పట్టిన వైసీపీ తెగులుకు టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరం: పవన్ కల్యాణ్

ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందని.. అది పోవాలంటే టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమండ్రిలో

ఈనెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లో ఉండేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరైన వైసీపీ..

YS Jagan: దుర్గమ్మ దీవెనలతో మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతంగా ఎదగాలి: సీఎం జగన్

స్త్రీ లేనిదే జననం లేదు. స్త్రీ లేనిదే గమనం లేదు. స్త్రీ లేనిదే సృష్టే లేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా పలు బాధ్యతలు మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది మహిళ.

Bigg Boss 7 Telugu : మరోసారి లేడీ కంటెస్టెంటే.. బిగ్‌బాస్ నుంచి పూజా మూర్తి ఎలిమినేట్, హౌస్‌లోకి రతిక రీ ఎంట్రీ

బిగ్‌బాస్ హౌస్ 7లో ఆడవాళ్ల ఎలిమినేషన్ కొనసాగుతూనే వుంది. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాలేదు.

Telangana BJP candidates:తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. సీఎం కేసీఆర్‌పై ఈటల పోటీ

ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది.