Bigg Boss 7 Telugu : షర్ట్ విప్పేసిన గౌతమ్ .. ఛాలెంజ్ అంటూ శోభాశెట్టి విశ్వరూపం , పవర్ అస్త్ర కోసం శివాజీ దిగులు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో పవర్ అస్త్ర కోసం ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పవర్ అస్త్ర ద్వారా శివాజీ, ఆట సందీప్‌లు హౌస్మేట్లుగా నిలిచారు. మూడవ పవర్ అస్త్ర కోసం అమర్దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్‌లను సెలక్ట్ చేశాడు బిగ్‌బాస్. దీనిపై ఇంటి సభ్యులు మండిపోగా.. వారిని చల్లార్చేందుకు గాను మరో కొత్త స్కెచ్ వేశాడు బిగ్‌బాస్. ఈ ముగ్గురిలో పవర్ అస్త్ర పొందేందుకు అనర్హులు ఎవరో చెప్పాలని ఆదేశించాడు. ఇదిలావుండగా.. శివాజీ పవర్ అస్త్రను అమర్దీప్ దొంగిలించి దాచేయడంతో ఇంటిలో పెద్ద గొడవ జరిగింది. నా పవర్ అస్త్ర సంగతి తేలే వరకు బిగ్‌బాస్ ఇచ్చిన బ్యాచ్‌లు ఇచ్చేది లేదని శివాజీ తెగేసి చెప్పాడు.
ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్-రతిక మధ్య ఏదో జరుగుతోంది అనుకుంటున్న వారికి .. రతిక-ప్రిన్స్ యావర్ వ్యవహారం షాకిస్తోంది. ఆమె ఈ ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ అస్త్ర టాస్క్‌కు ప్రిన్స్ అనర్హుడని రతిక నామినేట్ చేయడాన్ని ప్రిన్స్ తట్టుకోలేకపోయాడు. అయినప్పటికీ తనని తాను ఓదార్చుకుని రతికతో మామూలుగానే వుంటున్నాడు. ఇద్దరూ కలిసి చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి కూడా ఒకే ప్లేట్లో భోజనం చేశారు. వీరి యవ్వారంపై శుభశ్రీ, దామిని, గౌతమ్ గుసగుసలాడుకున్నారు.
మరోవైపు.. తన పవర్ అస్త్ర కోసం శివాజీ రచ్చ కంటిన్యూ చేశాడు. తొలుత అమర్‌దీపే దానిని దొంగిలించాడని అనుమానం వ్యక్తం చేసినప్పటికీ.. అమర్ తన మీదకు రాకుండా మేనేజ్ చేశాడు. ఈ క్రమంలో తేజపై అనుమానం వ్యక్తం చేశాడు శివాజీ. నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తే.. నమ్మకద్రోహం చేస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమర్దీప్ పవర్ అస్త్ర గురించి హింట్ ఇచ్చేలా.. ఓ టిష్యూ పేపర్‌పై ఏఏ, ఏ ఏడీ అని రాసి శివాజీ, రతిక బెడ్స్ దగ్గర పెట్టినా వాళ్లకి ఏం అర్ధం కాలేదు.
ఇంతలో పవర్ అస్త్ర కోసం టాస్క్ షురూ చేశాడు బిగ్‌బాస్. ప్రిన్స్ యావర్‌ను పిలిచి.. ఓ బల్లపై నీ గడ్డం పెట్టాలని, ఆపై అతడిని నామినేట్ చేసిన తేజ, దామిని, రతిక డిస్ట్రబ్ చేస్తారని .. గంట సేపు కదలకుండా వుండాలని రూల్ పెట్టాడు. దామిని, రతిక, తేజ.. పేడ, గడ్డి, శాంపూ వాటర్, ఐస్ ముక్కలతో ప్రిన్స్‌ని డిస్ట్రబ్ చేయాలని చూసినా అతను మాత్రం చలించకుండా అలాగే నిలిచి టాస్క్‌లో గెలిచాడు. తర్వాత శోభాశెట్టిని నామినేట్ చేసిన ప్రశాంత్, శుభశ్రీ, ప్రిన్స్ యావర్‌ల వీడియోలను ప్లే చేశారు. ఈ క్రమంలో గౌతమ్‌తో శోభ గొడవ పెట్టుకుంది. అప్పుడు కోపంతో ఊగిపోయిన గౌతమ్ ఒక్కసారిగా షర్ట్ విప్పి చూపించాడు. అనంతరం ఓ డంబుల్ తెచ్చుకుని అక్కడే వర్కవుట్లు చేయడం మొదలుపెట్టాడు.
షర్ట్ తీసి షో చేస్తున్నాడని శోభా కౌంటర్ ఇవ్వడంతో.. గౌతమ్ ఇంకా రెచ్చిపోయాడు. అవసరమైతే ప్యాంట్ కూడా తీసేస్తానని హెచ్చరించాడు. నీకు అసలు బిగ్‌బాస్ హౌస్‌లో వుండటానికి అర్హతే లేదని వ్యాఖ్యానించాడు. దీనికి శోభా ఘాటుగా బదులిచ్చింది. నీకంటే ఎక్కువ రోజులు ఉండి చూపిస్తానని గౌతమ్‌కు శోభాశెట్టి ఛాలెంజ్ విసిరింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments