Bigg Boss 7 Telugu : ఆ బూతులేంటీ .. భోలే షావళిపై నాగ్ ఆగ్రహం, శివాజీని పాముగా తేల్చేసిన ఇంటి సభ్యులు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు సక్సెస్‌ఫుల్‌గా సాగుతూ 50 రోజులు పూర్తి చేసుుకంది. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని శనివారం హౌస్‌లో అనౌన్స్ చేశారు. ట్విస్ట్‌లు, టర్న్‌లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఈ సీజన్ కాస్త బెటర్‌గానే సాగుతోందని చెప్పవచ్చు. వీకెండ్ కావడంతో నాగార్జున కంటెస్టెంట్స్ లోపాలను , వారి పర్ఫార్మెన్స్‌ను విశ్లేషిస్తూ ఓ ఆట ఆడుకున్నారు. కొన్ని నిజాలు మాట్లాడాలి అంటూ భోలే షావళి, ప్రియాంక, శోభాశెట్టిల గొడవ గురించి ప్రస్తావించారు. మనకు వాడుకలో ఎన్నో పదాలు వున్నాయని.. మరి ఎర్రగడ్డ అనే పదం ఏ ఫ్లోలో వచ్చింది అని షావళిని ప్రశ్నించాడు. తర్వాత ప్రియాంకను పిలిచి మాట జారిన తర్వాత క్షమాపణలు చెప్పినా అది వర్కవుట్ కాదన్నారు. చివరికి భోలే క్షమాపణలు చెప్పగా.. శోభాశెట్టి మాత్రం తన వల్ల కాదంది.. దానిని ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొంది.
తర్వాత శోభాశెట్టిని పిలిచి బిగ్‌బాస్ పంపిన కేక్‌ను అమర్‌దీప్‌కు ఎందుకు ఇచ్చావని ప్రశ్నించారు నాగ్.. తర్వాత తేజతో నీ నుంచి ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని.. ఇదంతా నాకు శాడిజంలా అనిపిస్తోందని ఫైర్ అయ్యారు. అలాగే అమర్‌ను కూడా ఆడుకుని అందరినీ హడలెత్తించాడు. కానీ చివరికి ట్విస్ట్ ఇస్తూ ఇది జస్ట్ ఫ్రాంక్ అని, కొత్తగా కేక్ తెప్పించి అమర్‌దీప్‌కు ఇచ్చాడు. అలాగే ఈ వీక్ బాగా ఇంప్రూవ్ అయ్యావని నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చారు. పనిలో పనిగా శివాజీ ఆరోగ్యం.. అస్తమానం వెళ్లిపోతా వెళ్లిపోతానంటూ ఆయన అంటున్న మాటలు కూడా నాగార్జున ప్రస్తావించారు. తనకు బాధగా వుందని శివాజీ అనగా.. ఫిజియో థెరపీ చేయిస్తానని నాగ్ హామీ ఇచ్చారు. లేనిపక్షంలో బిగ్‌బాస్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
తర్వాత పాము, నిచ్చెన గేమ్ ఆడించారు నాగార్జున. హౌస్‌లో పాము ఎవరో, నిచ్చెన ఎవరో చెప్పాలని ఒక్కొక్కరిని అడిగారు. అశ్విని .. శోభాశెట్టి (పాము), గౌతమ్ (నిచ్చెన), గౌతమ్.. అర్జున్ (నిచ్చెన), శివాజీ (పాము), శివాజీ.. యావర్ (నిచ్చెన), అమర్‌దీప్ (పాము), అమర్‌దీప్.. అర్జున్ (నిచ్చెన), తేజ (పాము), అర్జున్.. గౌతమ్ (నిచ్చెన), శివాజీ (పాము), ప్రిన్స్ యావర్.. గౌతమ్ (పాము), శివాజీ(నిచ్చెన), పూజా మూర్తి .. అర్జున్ (నిచ్చెన), అశ్విని (పాము), భోలే షావలి.. శివాజీ (నిచ్చెన), శోభాశెట్టి (పాము), శోభాశెట్టి.. భోలే (పాము), ప్రియాంక (నిచ్చెన), సందీప్.. శోభాశెట్టి (నిచ్చెన), శివాజీ (పాము), టేస్టీ తేజా.. అమర్‌దీప్ (నిచ్చెన), యావర్ (పాము), పల్లవి ప్రశాంత్.. పాము (పూజ), శివాజీ (నిచ్చెన), ఈ క్రమంలో అత్యధికంగా నిచ్చెనలు శివాజీ, అర్జున్‌లకు రాగా.. పాములుగాను శివాజీకే వచ్చాయి.
ఇకపోతే.. ఈ వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ హౌస్‌ను వీడుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భోలే షావళి, అశ్విని శ్రీ, తేజ, ప్రశాంత్, పూజా, అమర్‌దీప్, గౌతమ్‌లు ఈ వారం నామినేషన్స్‌లో వున్నారు. వీరిలో పూజా మూర్తి హౌస్‌ను వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటూ కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com