Bigg Boss 7 Telugu : హౌస్‌లో బూతు మాటలు, భోలేను ఆడుకున్న ప్రియాంక, శోభా.. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. సోమవారం వాగ్వాదం, ఘర్షణలతో సమయం మించిపోవడంతో ఏడుగురు మాత్రమే నామినేషన్స్‌లో పాల్గొన్నారు. అయితే ఇవాళ మాత్రం అమ్మాయిలు నోటికి పనిచెప్పారు. బూతులతో బిగ్‌బాస్ ఇంటిని గలీజు చేశారు. గతంలో జరిగిన ఆరు సీజన్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. దీంతో ప్రేక్షకులు ఆరే ఏంట్రా ఇది అని తలలు పట్టుకుంటున్నారు. ఇవాళ్టీ ఎపిసోడ్లో శోభాశెట్టి.. తేజ, భోలే, శివాజీ.. గౌతమ్, అమర్దీప్, అశ్విని శ్రీ.. పూజామూర్తి, అర్జున్, గౌతమ్.. భోలే, శివాజీ, భోలే.. శోభాశెట్టి, ప్రియాంక, ప్రిన్స్ యావర్.. గౌతమ్, అమర్‌దీప్‌లను నామినేట్ చేశారు. సోమ, మంగళవారాల్లో జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఆధారంగా ఈవారం భోలే షావళి, అశ్విని శ్రీ, తేజ, ప్రశాంత్, పూజా, అమర్దీప్, గౌతమ్‌లు నామినేట్ అయినట్లుగా బిగ్‌బాస్ ప్రకటించాడు.
నామినేషన్స్ ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. డేట్‌కి వెళ్లి.. ఐ లవ్ యూ చెప్పుకున్న వారానికే టేస్టీ తేజకు శోభాశెట్టి షాకిచ్చింది. ప్రతీది ఫన్నీగా తీసుకుంటున్నాడని, పొగరుగా వుంటున్నాడని అందుకే అతనిని నామినేట్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది. భోలేను నామినేట్ చేసే సమయంలో గొడవ తారా స్థాయికి చేరింది. హౌస్‌లో బూతులు మాట్లాడుతున్నాడంటూ అతనిని శోభ నామినేట్ చేసింది. దీనికి నోచ్చుకున్న భోలే.. నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుందిరా.. ఆడపిల్ల మంచి భవిష్యత్తు ఉంది’’ అని భోలే కామెంట్ చేశాడు.
ఇంతలో ఈ గొడవలోకి ప్రియాంక జోక్యం చేసుకుంది. నీలాంటి వాళ్లని చాలామందిని చూశా అని భోలే అన్నాడు. దీనికి హర్ట్ అయిన ప్రియాంక.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇన్ని రోజులు చాలా బాగున్నా అని భోలే.. అనగా నువ్వు నటించావంటూ ప్రియాంక ఫైర్ అయ్యింది. అంతేకాదు భోలేను ‘‘థూ’’ కొట్టింది.. నేను కూడా అదే పనిచేస్తే నీ బ్రతుకు ఏం కావాలి అని భోలే ప్రశ్నించాడు. అయితే తొలుత అతనిని మరో ప్రశాంత్ అని భావించిన కంటెస్టెంట్స్‌కు.. ప్రియాంక, శోభా కలిసి మబ్బులు విడిపోయేలా చేశారు. రైతుబిడ్డగా సింపతీ కొట్టేద్దామనుకున్న భోలే స్ట్రాటజీని బయటపెట్టేశారు.
నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రియాంక, శోభాల దగ్గరికి వెళ్లిన భోలే వారికి సారీ చెప్పి మంచి చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ వారిద్దరూ అంత ఛాన్స్ ఇవ్వలేదు. భోలేను అక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ యావర్, శివాజీలకు చెప్పారు. అటు టేస్టీ తేజ కూడా షాక్ లోంచి తేరుకున్నాక.. శోభతో మాట్లాడాడు. హౌస్‌లో వున్నవాళ్లంతా నామినేట్ చేయడం వేరు నువ్వు వేరు.. నువ్వు నామినేట్ చేయడం బాధ కలిగించిందని శోభతో అన్నాడు తేజ. తమ్ముడు, తమ్ముడే .. పేకాట పేకాటే అన్న అర్ధం వచ్చినట్లుగా .. స్నేహం స్నేహమే నామినేషన్ నామినేషనే అని తేజను సముదాయించే ప్రయత్నం చేసింది తేజ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com