అమ్మ సినిమాలే నాకు రిఫరెన్స్.. నో డైలాగ్స్ : శివాత్మిక
Send us your feedback to audioarticles@vaarta.com
ఆనంద్ దేవరకొండ, శివాత్మక నటీనటులుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్‌బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దొరసాని’. జులై 12న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన ముద్రను వేసింది. కె.వి.ఆర్. దర్శకునిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కాగా.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ శివాత్మిక మీడియాతో ముచ్చటించి సినిమా, తన రియల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మీకు ఎవరు రెఫరెన్స్, ఇన్సిపిరేషన్ అనే ప్రశ్న మీడియా నుంచి ఎదురవ్వగా శివాత్మిక చాలా లాజిక్‌గా సమాధానం ఇచ్చింది. తనకు అమ్మ సినిమాలే రిఫరెన్స్ అని స్పష్టం చేశారు. "ఈ కథ 80 దశకాల్లో జరిగే కథ అప్పటి కట్టు బొట్టు గురించి నాకు పెద్దగా తెలియదు. తలంబ్రాలు టైమ్‌లో అమ్మ అలంకరణ, స్టైల్‌ని రిఫరెన్స్‌లా తీసుకున్నాను. అచ్చం అమ్మాలాగే ఉన్నావని షూటింగ్ లోకేషన్స్‌లో అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నాకు ఒకటే చెప్పేవారు ఏ క్యారెక్టర్ చేస్తున్నా ఇన్వాల్వ్ అయి చేయమని చెప్పేవారు. అమ్మ నాకు ఎప్పుడూ ఒక ఎనర్జీ సోర్స్‌లాగా ఉంటుంది" అని శివాత్మిక చెప్పుకొచ్చింది.
సినిమా గురించి చిన్నపాటి లీక్స్!
అయితే సినిమాలో మా ప్రేమ కళ్ళలోనే కనపడుతుందని శివాత్మిక తెలిపారు. చాలా ప్రేమకథలలో కనిపించే స్వేచ్ఛ ఈ ప్రేమ కథలో ఉండదని.. మా ప్రేమ కళ్ళలోనే తెలుస్తుందన్నారు. అదే ఈ కథను కొత్తగా ప్రజెంట్ చేస్తుందని తన క్యారెక్ట్‌కి పెద్దగా డైలాగ్‌లుండవని.. తన పాత్రలోని ఎమోషన్స్ అన్నీ కళ్ళలోనే పలుకుతాయని సినిమా గురించి కాసింత లీక్ ఇచ్చింది. "షూటింగ్స్ అనేవి నా ఊహా తెలిసినప్పటినుండి నా జీవితంలో బాగం అయ్యాయి. స్కూల్ కన్నా ఎక్కవుగా షూటింగ్‌లోనే టైం స్పెండ్ చేసేదాన్ని. నేను హీరోయిన్ అవుతానంటే అందుకేనేమో ఇంట్లో ఎవరూ పెద్దగా సర్ ప్రైజ్ అవలేదు. కానీ దొరసాని రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందండి ఎక్కువవుతుంది" అని శివాత్మిక ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com