తండ్రి ఆరోగ్యంపై స్పందించిన శివాత్మిక రాజశేఖర్
Send us your feedback to audioarticles@vaarta.com
తండ్రి ఆరోగ్యంపై శివాత్మిక రాజశేఖర్ స్పందించింది. ఇటీవల హీరో రాజశేఖర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సిటి న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. అయితే తన తండ్రి ఆరోగ్యం స్లోగా మెరుగవుతోందని ట్విట్టర్ వేదికగా ఆయన కూతురు శివాత్మిక తెలిపింది.‘నాన్న స్లోగా కానీ ష్యూర్‌గా కోలుకుంటున్నారు. మీ అందరి ప్రార్థనలకు.. వెల్ విషెస్‌కు ధన్యవాదాలు. వియ్ లవ్ యు ఆల్’ అని శివాత్మిక ట్వీట్లో పేర్కొంది.
రాజశేఖర్ కుటుంబం మొత్తం ఒకేసారి కోవిడ్ బారిన పడింది. తొలుత కూతుళ్లిద్దరూ కోలుకున్నప్పటికీ.. జీవిత, రాజశేఖర్ మాత్రం ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే జీవిత కూడా క్రమంగా కోలుకున్నప్పటికీ రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో శివాత్మిక.. ‘‘కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు’’ ట్వీట్ చేసింది.
కాగా.. అప్పటి నుంచి రాజశేఖర్‌ను సిటి న్యూరో సెంటర్ వైద్యులు నాన్ ఇన్వాసివ్ వెంటలేటర్ సపోర్ట్‌తో చికిత్సను అందించారు. ఆ తరువాత క్రమక్రమంగా రాజశేఖర్ కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన కోలుకోవడంతో నాన్ ఇన్వాసివ్ వెంటలేటర్ సపోర్ట్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని శివాత్మిక వెల్లడించడంతో రాజశేఖర్ అభిమానులు ఆనందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com