అవార్డులు ప్రకటించిన వారందరికి అభినందనలు తెలియజేసిన 'మా' అధ్యక్షులు శివాజీ రాజా
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 15, 16 సంవత్సరాలకుగాను నంది పురస్కారాలతోపాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డులను మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అవార్డు విజేతలందరికి అనగా రఘుపతి వెంకయ్య అవార్డు-2014 ఎంపికైన కృష్ణంరాజు కి, 2016కి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి, అలాగే నంది పురస్కారానికి ఉత్తమ నటులుగా ఎంపికైన బాలకృష్ణ (2014-లెజెండ్) కు, మహేష్‌బాబు (2015-శ్రీమంతుడు) కు, ఎన్టీఆర్ (2016-జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో)తో పాటు..
ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలకు 2014కి ఎంపికైన నటుడు కమల్‌హాసన్ కి, 2015కి ఎంపికైన శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు కి, 2016కి ఎంపికైన నటుడు రజనీకాంత్ కి, బీఎన్ రెడ్డి పురస్కారం-2014కి ఎంపికైన ఎస్.ఎస్.రాజమౌళి కి, 2015కి ఎంపికైన త్రివిక్రమ్ కి, 2016కి ఎంపికైన బోయపాటి శ్రీనుకి, నాగిరెడ్డి-చక్రపాణి పురస్కారం-2014 కి ఎంపికైన ఆర్.నారాయణమూర్తి కి, 2015కి ఎంపికైన కీరవాణి కి, 2016కి ఎంపికైన కె.ఎస్.రామారావులకు 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ నరేష్ శుభాకాంక్షలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com