అవార్డులు ప్ర‌క‌టించిన వారంద‌రికి అభినంద‌న‌లు తెలియ‌జేసిన 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 15, 16 సంవత్సరాలకుగాను నంది పురస్కారాలతోపాటు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, బీఎన్‌ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డులను మంగ‌ళ‌వారం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా అవార్డు విజేత‌లంద‌రికి అన‌గా రఘుపతి వెంకయ్య అవార్డు-2014 ఎంపికైన కృష్ణంరాజు కి, 2016కి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి, అలాగే నంది పుర‌స్కారానికి ఉత్త‌మ‌ నటులుగా ఎంపికైన‌ బాలకృష్ణ (2014-లెజెండ్‌) కు, మహేష్‌బాబు (2015-శ్రీమంతుడు) కు, ఎన్టీఆర్‌ (2016-జనతా గ్యారేజ్‌, నాన్నకు ప్రేమతో)తో పాటు..

ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాలకు 2014కి ఎంపికైన నటుడు కమల్‌హాసన్ కి, 2015కి ఎంపికైన‌ శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు కి, 2016కి ఎంపికైన నటుడు రజనీకాంత్ కి, బీఎన్‌ రెడ్డి పురస్కారం-2014కి ఎంపికైన ఎస్‌.ఎస్‌.రాజమౌళి కి, 2015కి ఎంపికైన‌ త్రివిక్రమ్ కి, 2016కి ఎంపికైన బోయపాటి శ్రీనుకి, నాగిరెడ్డి-చక్రపాణి పురస్కారం-2014 కి ఎంపికైన ఆర్‌.నారాయణమూర్తి కి, 2015కి ఎంపికైన‌ కీరవాణి కి, 2016కి ఎంపికైన‌ కె.ఎస్‌.రామారావుల‌కు 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు శివాజీరాజా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

More News

చలో టీజర్, మూవీ రిలీజ్ డేట్స్

"ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌వైభోగం","జ్యోఅచ్చుతానంద‌" లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో... ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య.

'ఖాకి'లో కార్తి, రకుల్ కెమిస్ట్రీ

ఒక సినిమా హిట్ కావడానికి చాలా అంశాలు దోహదం చేస్తుంటాయి. కొన్ని సార్లు యాక్షన్, మరికొన్ని సార్లు కామెడీ.. ఇలా ఒక్కోసారి ఒక్కొక్క జోనర్ అంశాలు పైచేయిగా నిలుస్తుంటాయి. అయితే ఎవర్గ్రీన్ విషయం, ఎవర్గ్రీన్గా యువ హృదయాలను కదిలించే అంశం రొమాన్స్.

ఏపీ ప్ర‌భుత్వం నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌భుత్వం 2014 నుండి 2016 వ‌ర‌కు నంది అవార్డుల ప్ర‌క‌టించింది. నంది అవార్డుల‌తో పాటు ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు, ర‌ఘుప‌తి వెంక‌య్య‌, బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించింది. మూడు ఏడాదిల‌కు క‌లిపి ఒకేసారి అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. 

గౌర‌వప్ర‌ద‌మైన అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో  అవార్డు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్ర‌తిష్టాత్మ‌క ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు మెగాస్టార్ కు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

జోరుగా 'ఖాకి' ప్రమోషన్స్

ఇవాళ్టి రోజుల్లో ప్రచారానికి ఉన్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను కష్టపడి చేసిన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో హీరోలు చాలా ముందుంటున్నారు.