నిర్మాత కొడుకుతో జత కడుతున్న శివాని...

  • IndiaGlitz, [Thursday,July 27 2017]

జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంపతుల త‌న‌య శివాని త్వ‌ర‌లోనే తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ విష‌య‌మై అధికార‌క స‌మాచారం కూడా వ‌చ్చింది. కానీ అస‌లు శివాని తెలుగులో ఎంట్రీ ఇస్తుందా, లేదా త‌మిళంలో ఎంట్రీ ఇస్తుందా అని ఎక్క‌డా క్లారిటీ లేదు. కొంద‌రేమో శివాని తమిళంలో 'కుంకి2' సినిమాతో ఎంట్రీ ఇస్తుంద‌ని అంటుంటే మ‌రికొంద‌రు మాత్రం తెలుగులోనే అంటున్నారు.
అయితే ఫిలింన‌గ‌ర్ వార్త‌ల ప్ర‌కారం శివాని పెళ్ళిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా చేయ‌నున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని అంట‌న్నారు. యు.ఎస్‌లో చ‌దువుకుంటున్న శివ వ‌చ్చే ఏడాది తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబ‌ట్టి శివాని కూడా వ‌చ్చే ఏడాదినే తెలుగులో ఎంట్రీ ఇస్తుందన్నమాట‌. శివ సినిమాగా న‌టించ‌బోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.