దేవనార్ స్కూల్‌లో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ శివానీ రాజశేఖర్
Send us your feedback to audioarticles@vaarta.com
నా పుట్టినరోజు సందర్భంగా నా సంతృప్తి కోసం నేను, నా తల్లిదండ్రులు కలిసి మన భూమి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. మన భూమిని మనమే కాపాడుకోవాలి. అందుకనే చెట్లని నాటాలి` అని అన్నారు హీరోయిన్ శివానీ రాజశేఖర్. ఈమె పుట్టినరోజు జూలై1.
ఈ సందర్భంగా శివానీ రాజశేఖర్, రాజశేఖర్, జీవిత దంపతులు మేడ్చల్ రింగురోడ్డు వద్ద హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దేవనార్ అంధుల పాఠశాలకు వెళ్లి అక్కడి పిల్లలను కలిసి ముచ్చటించారు. అక్కడే కేక్ కట్ చేసి తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా... శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ - `` ఈ పుట్టినరోజును ఇలా కొత్తగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇకపై ప్రతి పుట్టినరోజును ఇలాగే మీ మధ్యలోనే సెలబ్రేట్ చేసుకుంటాను. ఇక్కడి పిల్లల తెలివి తేటల్ని చూస్తుంటే ఆశర్యంగా, ఆనందంగా ఉంది. మా అందరి కంటే మీరే చాలా గ్రేట్`` అన్నారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ - `` ఇక్కడున్న పిల్లలు సాధించిన విజయాలు చూస్తేంటే మేం ఇంకా ఎంతో సాధించాలని అనుకోవాలి. దేవుళ్లతో సమానమైన పిల్లలు మీరు. మీరింకా ఎంతో ఉన్నతి సాధించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కడుతున్న స్కూల్‌కి మా చేతనైన సహాయం చేస్తాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments